రామ్‌ చరణ్‌ ‘ఉప్పెన’ కథ పై ఆసక్తికర పుకార్లు షికారు

రామ్ చరణ్ హీరో గా ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది.సమ్మర్ లో వరుసగా చిత్రీకరణ చేసి ఏప్రిల్ లేదా మే నెల వరకు చిత్రీకరణ పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ఇదే సమయం లో రామ్‌ చరణ్ హీరో గా ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం లో ఒక సినిమా ను చేయాలని భావిస్తున్నారు.

అందు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది.ఇటీవలే బుచ్చి బాబుతో కలిసి ఫైనల్ నరేషన్ తీసుకున్న రామ్ చరణ్ స్క్రిప్ట్‌ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో రామ్ చరణ్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడట.

గ్రామం లో కబడ్డీ ఆట కు ఉన్న ప్రాముఖ్యత మరియు కబడ్డీ ఆట చుట్టు సాగే భావోద్వేగాలతో సినిమా రూపొందుతుందని వార్తలొస్తున్నాయి.

"""/" / రామ్ చరణ్ గతంలో రంగస్థలం సినిమా లో విభిన్నమైన పల్లెటూరి కుర్రాడి పాత్ర లో కనిపించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు బుచ్చిబాబు కూడా అదే తరహా లో తన గురువు మాదిరిగా రామ్ చరణ్ ని పల్లెటూరు కుర్రాడు పాత్ర లో చూపించాలని భావిస్తున్నాడట.

"""/" / అందుకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్టు రెడీ అయిందని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా విభిన్నమైన స్క్రిప్టును దర్శకుడు బుచ్చి బాబు రెడీ చేశాడని మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ స్క్రిప్ట్ కి మురిసి పోయాడని సమాచారం అందుతుంది.

మొదట ఈ కథ ను ఎన్టీఆర్ కి చెప్పారనే ప్రచారం జరుగుతుంది.అందులో ఎంత వరకు నిజముంది అనేది తెలియదు.

కానీ బుచ్చి బాబు తదుపరి సినిమా రామ్ చరణ్ తో కన్ఫర్మ్ అయింది.

ఎన్టీఆర్ తో సినిమా ఉందా లేదా అని తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.