చరణ్ ఎంపిక సరైనదే.. ఊపిరి పీల్చుకున్న మెగా ఫ్యాన్స్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్( Ram Charan ) ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్ అనే సినిమా ను చేస్తున్నాడు.

దిల్‌ రాజు నిర్మిస్తున్న ఆ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో నటించడం గొప్ప విషయం.అయితే రామ్ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు( Buchi Babu Sana ) దర్శకత్వం లో సినిమా ను చేయాలి అనుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బుచ్చి బాబు దర్శకత్వం లో వచ్చిన ఉప్పెన సినిమా ఏదో చిన్న లాజిక్‌ వల్ల హిట్ అయ్యి ఉంటుంది.

"""/" / అంత మాత్రాన చరణ్ అవకాశం ఇవ్వాలా అంటూ కొందరు ప్రశ్నించారు.

ఎన్టీఆర్‌ పిలిపించుకుని కొన్ని వారాలు కథ ను చెప్పించుకుని ఆ తర్వాత నో చెప్పాడు.

అలాంటి బుచ్చి బాబుకు ఎందుకు చరణ్ బాబు ఓకే చెప్పాడు అంటూ కొందరు ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.

ఎట్టకేలకు ఆ వారు కూడా ఊపిరి పీల్చుకునే వార్త వచ్చింది.అదే ఉప్పెన సినిమా( Uppena )కు ఉత్తమ తెలుగు సినిమా అవార్డ్ లభించింది.

"""/" / బుచ్చి బాబు సక్సెస్ ఏదో గాలి వాటు సక్సెస్ కాదని జాతీయ అవార్డు రావడం ద్వారా నిరూపితం అయింది.

అందుకే బుచ్చి బాబు దర్శకత్వం లో రామ్ చరణ్ సినిమా కు ఒప్పుకోవడం తప్పేం కాదు అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం బుచ్చి బాబు మరియు చరణ్ మూవీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న శంకర్‌ గేమ్‌ ఛేంజర్‌ కు ఏమాత్రం తగ్గకుండా బుచ్చి బాబు దర్శకత్వం లో చరణ్ హీరోగా ఒక స్పోర్ట్స్ డ్రామా రూపొందబోతుంది.

వచ్చే ఏడాది లోనే బుచ్చి బాబు సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

రేవంత్ కు టార్గెట్ అయిపోయిన హరీష్ రావు