స్కంద విషయంలో చేసిన పది తప్పులు ఇవే.. ఆ కారణాల వల్లే ఈ మూవీ యావరేజ్ అంటూ?
TeluguStop.com
రామ్ బోయపాటి శ్రీను( Ram Boyapati Srinu ) కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద మూవీ ప్రస్తుతం యావరేజ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.
యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.
ఈ సినిమాలో ఉన్న పది తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
1) స్కంద సినిమా( Skanda Movie )ను చూస్తే కొన్నేళ్ల క్రితం విడుదలైన బెంగాల్ టైగర్, సరైనోడు సినిమాలను మిక్స్ చేసినట్టు ఉంది.
కథ, కథనం ఏ మాత్రం కొత్తగా లేవు.2) బోయపాటి శ్రీను ఈ సినిమాలో యాక్షన్ సీన్లు చూసి ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు.
ఏ మాత్రం ఆసక్తిగా లేని యాక్షన్ సీన్లు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి. """/" /
3) రామ్ శ్రీలీల లవ్ ట్రాక్( Ram Sreeleela ) గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.
శ్రీలీల రామ్ తో లవ్ లో పడటానికి సరైన కారణం కూడా కనిపించదు.
4) స్కంద సినిమాలో పాటల్ ప్లేస్ మెంట్ దారుణంగా ఉంది.ఏ పాట ఎప్పుడు వస్తుందో ఎందుకు వస్తుందో ఎవరికీ అర్థం కాదు.
5) స్కంద సినిమాలో అనవసర సీన్లు ఎక్కువగా ఉన్నాయి.ఆ సీన్లను కట్ చేసి ఉంటే సినిమా నిడివి కొంతమేర తగ్గేది.
"""/" /
6) ఈ సినిమాలో కొత్తదనం అణువంతైనా లేదు.రొటీన్ మాస్ మసాలా సినిమాను చూసిన అనుభవాన్ని ఈ సినిమా కలిగిస్తోంది.
7) సినిమాలోని ట్విస్టులు సైతం ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవు.ఇద్దరు సీఎంల పాత్రలను కామెడీ చేసి దర్శకుడు ఈ సినిమాను నడిపించారు.
8) క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ లెజెండ్, అఖండ ఇంటర్వెల్ సీన్లను( Skanda Interval Scene ) గుర్తు చేసే విధంగా ఉంది.
9) రాజమౌళి, ప్రశాంత్ నీల్( Prashanth Neel ) లాంటి దర్శకులు సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తుండగా బోయపాటి శ్రీను మాత్రం ఆ విషయంలో ఫెయిలవుతున్నారు.
10) అఖండ( Akhanda )తో మ్యాజిక్ చేసిన బోయపాటి శ్రీను స్కందతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయారు.
50,000 ఏళ్ల తర్వాత కూడా చెక్కుచెదరని బేబీ మముత్.. శాస్త్రవేత్తలు షాక్!