అన్ని సంఘాలతో ఉత్తరాంధ్రలో త్వరలో ర్యాలీ..: మంత్రి బొత్స

అన్ని సంఘాలతో కలిసి ఉత్తరాంధ్రలో త్వరలోనే ర్యాలీ చేస్తామని మంత్రి బొత్స అన్నారు.

విశాఖలో వికేంద్రీకరణకు మద్ధతుగా జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.అమరావతి రైతులు అప్పటి ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో రాజధాని అమరావతిలోనే కట్టాలని ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు.

రైతుల పాదయాత్రను అడ్డుకోవడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు.కానీ వ్యవస్థను గౌరవించాలని చెప్పారు.

శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే కర్నూలును న్యాయరాజధానిగా చేస్తున్నామన్నారు.ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే నష్టం ఏంటని ప్రశ్నించారు.

అమరావతి కూడా రాష్ట్రంలో ఒక భాగమేనన్న ఆయన.అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ఉద్దేశం అని తెలిపారు.

వికేంద్రీకరణతోనే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

పూరీ జగన్నాథ్ నెక్స్ట్ సినిమా కోసం డేట్స్ ఇస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో…