రకుల్ ప్రీతి సింగ్ ఆస్తులు అన్ని కోట్లా..?

తెలుగులో చాలా మంది టాప్ హీరోయిన్లుగా గుర్తింపు పొందారు వాళ్లలో రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preeti Singh ) ఒకరు.ఢిల్లీలో పుట్టిన ఈ అమ్మడు.`గిల్లి` అనే క‌న్న‌డ మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది.కేరటంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి `వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్`( Venkatadri express movie )తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది.త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది.ఎన్టీఆర్‌, మ‌హేష్ బాబు, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్, నాగార్జున వంటి అగ్ర హీరోల‌తో ఆడిపాడింది.

త‌మిళంలోనూ ప‌లు చిత్రాల్లో న‌టించింది.అయితే టాలీవుడ్ లో సంపాదించుకుంటున్న క్రేజ్ తో ఇప్పుడు ఈ బ్యూటీ బాలీవుడ్ లో స‌త్తా చాటేందుకు తెగ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.తెలుగు సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌స్తున్నా స‌రే.వాటిని ప‌క్క‌న పెట్టి మ‌రీ బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.ఇక‌పోతే ద‌శాబ్ద‌న్న‌ర కాలం నుంచి ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్న ర‌కుల్‌. ఆస్తుల‌ను గ‌ట్టిగానే కూడ‌బెట్టింది. హైదరాబాద్‌తో పాటు ముంబై, వైజాగ్ లాంటి చోట్లలో రకుల్ ప్రీత్ సింగ్‌(Rakul Preet Singh)కు ఆస్తులు ఉన్నాయి.హైద‌రాబాద్ లో దాదాపు 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక సొంత ఫ్లాట్ ఉంది.దీని విలువ రూ.5 కోట్ల వ‌ర‌కు ఉంటుంది.షూటింగ్స్ కోసం హైదరాబాద్ కి వచ్చినపుడు ర‌కుల్‌ తన సొంత ఇంట్లోనే ఉంటుంది.

ముంబైలోనూ ర‌కుల్ కు సొంత ఫ్లాట్ ఉంది.అలాగే హీరోయిన్ గా స‌త్తా చాటుతూనే ర‌కుల్‌.వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది.

ఎఫ్‌45 పేరుతో వైజాగ్ లో ఒక‌టి, హైద‌ర‌బాద్ లో రెండు జిమ్స్ ఓపెన్ చేసి స‌క్సెస్ అయింది.ర‌కుల్ గ్యారేజ్‌లో ఖ‌రీదైన కార్లు ఉన్నాయి.ఇక ర‌కుల్ ద‌గ్గ‌ర అత్యంత విలువైన ఓ డైమంగ్ రింగ్ ఉంద‌ట‌.వీని విలువ కోట్ల‌లో ఉంటుంద‌ట‌.మొత్తంగా ర‌కుల్ ఆస్తుల విలువ దాదాపు రూ.40 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని ప‌లు నివేదిక‌లు చెబుతున్నాయి.అన‌ట్లు ర‌కుల్ బాలీవుడ్ న‌టుడు, నిర్మాత జాకీ భగ్నానీతో( Jackky Bhagnani ) ప్రేమాయ‌ణం న‌డిపిస్తోంది.ఈ విష‌యాన్ని గ‌తంలోనే ర‌కుల్ అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసింది.

దారుణం, రక్షకుడే భక్షకుడయ్యాడు.. పబ్లిక్‌లో యువతిని రక్తం వచ్చేలా ఎలా కొట్టాడో చూస్తే..