Rakul Preet Singh : పెళ్లి జరిగితే పద్ధతిగా ఉండాలా.. స్ట్రాంగ్  కౌంటర్ ఇచ్చిన రకుల్?

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి నటి రకుల్ ప్రీతి సింగ్ ( Rakul Preet Singh ) ఇటీవల పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 21వ తేదీ తన పేరు జాకీ భగ్నానిని( Jackky Bhagnani ) పెళ్లి చేసుకొని ఈమె కొత్త జీవితం ప్రారంభించారు.

ఇలా పెళ్లి తర్వాత కూడా రకుల్ ప్రీతి సింగ్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు యాంకర్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

"""/"/ రకుల్ పెళ్లి తర్వాత కూడా పొట్టి దుస్తులను ధరించి భారీ స్థాయిలో గ్లామర్ షో( Glamor Show ) చేస్తూ ఫోటోషూట్ లో చేశారు.

ఆ ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.అయితే ఈ విషయం గురించి యాంకర్ ప్రశ్నిస్తూ పెళ్లి తర్వాత మీ ఇంట్లో మీ వస్త్రధారణ( Dressing Sense ) ఏమైనా మార్చుకోమని చెప్పారా అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు రకుల్ సమాధానం చెబుతూ.అలా వస్త్రధారణ మార్చుకోమని నాకెవరు చెప్పలేదు నేను పుట్టింట్లో ఎంత స్వేచ్ఛగా ఉన్నానో అత్తగారింట్లో కూడా నాకు అంతే స్వేచ్ఛనిచ్చారని ఈమె తెలిపారు.

"""/"/ ఈ సమాజమే పెళ్లి( Rakul Marriage ) అనే విషయాన్ని పెద్దదిగా చేసి చూస్తుందని ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సహజ ప్రక్రియ అని తెలిపారు.

పెళ్లి తర్వాత పద్ధతిగా బట్టలు అమ్మాయిలు మాత్రమే వేసుకోవాలా అబ్బాయిలను కూడా దగదగా మెరిసే షేర్వానీలు వేసుకోమని చెప్పొచ్చు కదా కేవలం ఆడవారి విషయంలోనే ఎందుకు ఇలా.

కాలం మారింది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు.ఎవరికి నచ్చిన దుస్తులను వాళ్ళు వేసుకుంటారు అంటూ ఈ సందర్భంగా రకుల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

డాన్సర్స్ తో కలిసి చిందేసిన ఏనుగు.. వీడియో వైరల్