శరీరం చెప్పిన మాట వినండి… గాయం పై స్పందించిన రకుల్!

సౌత్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రకుల్ ప్రీతిసింగ్( Rakul Preeth Singh ) ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయ్యారు.

ఈమెకు సౌత్ లో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు.ఇకపోతే ఇటీవల రకుల్ ప్రీతిసింగ్ వర్క్ అవుట్ ( Work Outs )చేస్తున్న సమయంలో గాయాలు పాలయ్యారనే విషయం తెలిసిందే.

ఈమె వర్క్ అవుట్స్ చేస్తూ ఒకేసారి 80 కేజీల బరువు ఎత్తడంతో వెన్నెముకకు గాయం అయింది.

అయినప్పటికీ తన గాయాన్ని లెక్కచేయకుండా సినిమా షూటింగ్లో పాల్గొనడం వల్ల నొప్పి తీవ్రత అధికమై మంచానికే పరిమితమయ్యారు.

"""/" / ఇలా గత వారం రోజులుగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్న రకుల్ ప్రీతిసింగ్ తాజాగా తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

నా శరీరం చెప్పిన మాట వినకుండా నేను పిచ్చి పని చేశాను.మీరు కూడా మీ శరీరం చెప్పిన విధంగా వినండి.

శరీరం చెప్పింది అంటే ఏమాత్రం ఆశ్రద్ధ చేయొద్దు అంటూ తన గాయం గురించి ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈమె పెట్టిన పోస్ట్ చూస్తే తనకు నొప్పి తీవ్రత అధికంగానే ఉందని తెలుస్తోంది.

"""/" / రకుల్ తన నొప్పి గురించి ఈ విధమైనటువంటి పోస్ట్ చేయడంతో అభిమానులు ఈమె త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

  ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న ఈమె తెలుగు సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసారు.

అయితే సరైన అవకాశాలు లేకే తాను తెలుగు సినిమాలు చేయలేదని పలు సందర్భాలలో తెలిపారు.

ఇక రకుల్ తెలుగులో చివరిగా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన కొండ పొలం ( Kondapolam ) సినిమాలో నటించారు.

జుట్టు దట్టంగా పెరగాలా.. అయితే ఈ ఆయిల్ ను వాడండి!