కనికరించమంటున్న బ్యూటీ.. అవకాశాలే లేవట!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసే అవకాశం కొట్టేసింది.

అయితే అమ్మడికి గతకొంత కాలంగా అదృష్టం కలిసి రావడం లేదు.కేవలం అరకొర సినిమాలతో నెట్టుకొస్తున్న రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

ఇప్పటికే టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన రకుల్, అటు కోలీవుడ్‌లోనూ తన సత్తా చూపిస్తుంది.

దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది.అయితే ఈ క్రమంలో అమ్మడు హాట్ ఫోటోషూట్‌లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుండటంతో ఆమె ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు కూడా ఆమె అందాలపై కామెంట్లు వేస్తున్నారు.

అయితే కేవలం అందాల ప్రదర్శనతో సినిమా ఆఫర్లు వస్తాయని అనుకోవడం మూర్ఖత్వం అంటున్నారు సినీ ప్రేక్షకులు.

కాగా తనకు ఆఫర్లు రాకపోవడంపై రకుల్ స్పందించడం లేదు.తనకు అవకాశం వచ్చినప్పుడే తాను సినిమాలు చేస్తానని కుండ బద్దలు కొడుతోంది.

ఏదేమైనా ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేసిన రకుల్ ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అంటున్నారు ప్రేక్షకులు.

100 కోట్ల పైన మొదటి రోజు కలెక్షన్స్ సాధించిన ప్రభాస్ 5 సినిమాలు ఇవే