నేను ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాను : హీరోయిన్ రకుల్
TeluguStop.com
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయిన సినిమాల్లో ఒక్క ఛాన్స్ కూడా దక్కించుకోలేకపోయింది.
కనీసం ఒక్క బిగ్గెస్ట్ హిట్‌లో కూడా ఆమె భాగం కాలేకపోయింది.రష్మిక మందన్న, తమన్నా లాగా ఆమె అంతగా క్లిక్ కాలేకపోయింది టాలీవుడ్ నుంచి కనుమరుగయ్యింది కూడా.
హిందీలో కూడా పెద్దగా రాణించలేకపోతోంది అయితే దానికి కారణం తను దురదృష్టమే అని రకుల్ చెబుతోంది.
రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ నాజూకు సుందరి తన కెరీర్‌లో ఎదురైన కొన్ని కష్టాల గురించి మాట్లాడింది.
ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం తనకు వచ్చిందని, కానీ ఆ తర్వాత తన స్థానంలో దిశా పటాని వచ్చారని చెప్పింది.
ఈ సినిమాను నీరజ్ పాండే దర్శకత్వం వహించాడు, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్( Sushant Singh Rajput) ధోని పాత్రను పోషించాడు.
"""/" /
ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయింది.రకుల్ చెప్పిన దాని ప్రకారం, ఈ బయోపిక్ షూటింగ్ ఒక నెల పాటు ఆలస్యం అయింది.
ఆ తర్వాత రకుల్ వేరువేరుగా చేస్తున్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల సినిమాల షూటింగ్స్ ప్రారంభమయ్యాయి.
ఆ సినిమాల షూటింగ్‌లతో ఆమె చాలా బిజీ అయిపోయింది.ధోనీ సినిమా కోసం ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది.
“ఈ రోల్ చివరికి దిశా పటాని( Disha Patani ) నటించింది.నేను కాస్ట్యూమ్ ట్రయల్ చేసి, స్క్రిప్ట్ రీడింగ్ కూడా చేసేశాను.
కానీ వాళ్ల షూటింగ్ డేట్స్ ఒక నెల పాటు మారిపోయాయి.ఆ సమయంలో నేను రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో సినిమాలు చేస్తున్నాను.
అంతేకాకుండా, ‘బ్రూస్ లీ: ది ఫైటర్’ సినిమా రిలీజ్ కి ఇంకో నెల మాత్రమే ఉంది, రెండు పాటలు మిగిలి ఉన్నాయి.
అందుకే, నేను డేట్స్‌ని అడ్జస్ట్ చేసుకోలేకపోయాను.ఇంత మంచి సినిమా నా చేతిలోంచి పోయిందని నేను చాలా ఏడ్చాను,” అని ఆమె చెప్పింది.
"""/" /
ఆ తర్వాత, ప్రభాస్‌తో నటించాల్సిన రెండు తెలుగు సినిమాల్లో నుంచి తనని రిమూవ్ చేశారని వాపోయింది.
" 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టే ముందు, ప్రభాస్‌తో కలిసి మరో రెండు సినిమాల్లో నటించాల్సి ఉంది.
అప్పుడు నాకు అంతగా బాధ లేకపోయినా, తర్వాత నాకు 'బ్యాడ్ యాటిట్యూడ్' ఉందనే అపోహ ఎవరైనా పెట్టుకున్నారేమో అని అనుకున్నాను.
" అని రకుల్ చెప్పింది.ఇకపోతే రకుల్ ఇటీవల కమల్ హాసన్ హీరోగా వచ్చిన 'ఇండియన్ 2' సినిమాలో నటించింది.
ఈ సినిమాను శంకర్ దర్శకత్వం వహించారు.ఇది 1996లో వచ్చిన 'ఇండియన్' సినిమాకు సీక్వెల్.
కానీ, ఈ సినిమా ఫస్ట్ పార్ట్ లాగా హిట్ కాలేదు.
రైలు ఎక్కబోయి పట్టాలపై పడ్డ యువతి.. చివరకు? (వీడియో)