నా పెళ్లి గురించి నాకైనా చెప్పాలి కదా.. రకుల్ ప్రీత్ ఫైర్!

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి మనందరికీ తెలిసిందే.అది తక్కువ సమయంలోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి భారీగా పాపులారిటిని సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్.

ఈమె తెలుగులో సరైనోడు, జయ జానకి నాయక, ధ్రువ, నాన్నకు ప్రేమతో, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, లౌక్యం, పండగ చేసుకో, బ్రూస్ లీ, కరెంట్ తీగ ఇలా ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.

ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమలో మునిగితేలుతున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇదే విషయంపై రకుల్ ప్రీత్ సింగ్ అధికారికంగా కూడా ప్రకటించింది.ఆమె జాకీ భగ్నాని తో ప్రేమలో మునిగి తేలుతోంది.

తన ప్రియుడితో కలిసి పార్టీలు పబ్బులు వెకేషన్ లు తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.

గత కొద్ది రోజులుగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు వీడియోలు బయటికి రావడంతో వీరిద్దరూ కలిసే ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇటువంటి సమయంలోనే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు రకుల్ ప్రేమ విషయంపై స్పందిస్తూ తన సోదరి ప్రస్తుతం తన సోదరీ ప్రేమలో ఉందని, తన సోదరి, జాకీ భగ్నాని త్వరలోనే పెళ్లి చేసుకోమని ఒకటవబోతున్నారు అంటూ క్లారిటీ ఇచ్చాడు.

"""/"/ ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కాగా తన తమ్ముడు ఇచ్చిన క్లారిటీ పై తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది.

తన తమ్ముడు ట్వీట్ చేసిన దానిపై రకుల్ రీ ట్వీట్ చేస్తూ .

నా పెళ్లి గురించి నువ్వు నిజంగానే స్పష్టతను ఇచ్చావా? నా పెళ్లి గురించి నాకు కూడా కాస్త క్లారిటీ ఇవ్వాలి కదా బ్రో? నా జీవితం గురించి నాకే తెలియకుండా పోయింది అంటూ.

నవ్వుతున్న ఎమోజిని షేర్ చేసింది రకుల్.ఎందుకు సంబంధించిన ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వైరల్ : అయ్యబాబోయ్.. 3 రోజుల్లో 60 మందిని పెళ్లాడిన మహిళ..