ఎన్టీఆర్ బయోపిక్ లో ఐటెం సాంగ్ లో డాన్స్ చేయనున్న టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
TeluguStop.com
దివంగత మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్.బాలకృష్ణ టైటిల్ రోల్‌ని పోషిస్తున్నాడు.
కె.ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి.
వచ్చే ఏడాది జనవరి 9న మూవీ విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్లు ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి.
చంద్రబాబు గా రానా పోస్టర్, అక్కినేని నాగేశ్వర రావు గా సుమంత్ పోస్టర్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తుండగా.సావిత్రిగా కీర్తి సురేష్, జయప్రదగా రాశి ఖన్నానటిస్తున్నారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఇది ఇలా ఉండగా.ఈ చిత్ర యూనిట్ ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ ను కలిశారంట.
ఈ సినిమాలో ఓ ఐటెం పాటలో రకుల్ కనిపించనుంది అంట.ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
కాగా, కలర్ మూవీస్ వచ్చాక ఎన్టీఆర్ సినిమాల్లోని చాలా ఐటెమ్ సాంగ్స్ సూపర్ హిట్‌గా నిలిచాయి.
దీంతో.ఏ పాటలో రకుల్‌ప్రీత్ అలరిస్తుందో చూడాలి.