నా కోసం 7/జి బృందావన్ కాలనీ క్లైమాక్స్ మార్చారు : రకుల్ ప్రీత్

యాక్ట్రెస్ రకుల్ ప్రీత్‌ సింగ్( Rakul Preet Singh) ఇప్పుడంటే బాలీవుడ్ కి వెళ్ళిపోయింది కానీ ఒకప్పుడు టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ దుమ్మురేపేది.

కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.వెంకటాద్రి సినిమాతో అందరికీ డ్రీమ్ గర్ల్ అయిపోయింది.

ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ అందాలకు అందరూ ఫ్లాట్ అయిపోయారు.కరెంటు తీగ సినిమాలో కూడా అల్లరి పిల్లగా చిలిపి చేష్టలు చేస్తూ కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టింది.

పండగ చేస్కో, ధ్రువ, రారండోయ్ వేడుక చూద్దాం అంటే మరిన్ని సినిమాలతో మరింత దగ్గర అయింది.

తర్వాత ఆమె తీసిన సినిమాలు పెద్దగా ఆడక అవకాశాలు కోల్పోయింది.చివరికి ఇతర భాషల ఇండస్ట్రీలకు వెళ్లిపోయింది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో తన ఫస్ట్ మూవీ గురించి కొన్ని విశేషాలు చెప్పింది.

"""/" / ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను నటించిన మొదటి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన 7G బృందావన్ కాలనీ అని చెప్పింది.

అది విని చాలామంది నోరెళ్లపెట్టారు.అయితే ఈ ముద్దుగుమ్మ ఒరిజినల్ 7G బృందావన్ కాలనీ సినిమాలో నటించలేదు.

ఈ సినిమాకి కన్నడ రీమేక్ గా వచ్చిన మూవీలో "గిల్లి( Gilli)"లో హీరోయిన్ గా చేసింది.

2009లో విడుదలైన ఈ కన్నడ సినిమా తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన "7G బృందావన్ కాలనీ" లాగా పెద్ద హిట్ కాలేదు.

ఇందులో గురురాజ్ జగ్గేష్, రకుల్ ప్రీత్ సింగ్( Gururaj Jaggesh ) హీరో హీరోయిన్లుగా నటించారు.

ఇది రకుల్ ప్రీత్ సింగ్ కి తొలి సినిమా కాబట్టి అందులో ఆమె చక్కగా నటించలేకపోయింది.

విమర్శలు కూడా వచ్చాయి.రాఘవ్ లోకి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు.

ఈ సినిమాను 2009 ఫిబ్రవరిలో ప్రారంభించి, దీపావళి సందర్భంగా 2009 అక్టోబర్ 16న విడుదల చేశారు.

ఈ సినిమా పెద్ద హిట్ అయి ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ కన్నడ ఇండస్ట్రీలోనే సెటిల్ అయిపోయేది.

"""/" / ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "నాకు క్లైమాక్స్ నచ్చలేదు.చాలా ఎమోషనల్ గా ఉండటం వల్ల ఏడ్చేసాను.

మా నాన్నకి ఫోన్ చేసి అదే విషయాన్ని చెప్పాను అప్పుడు 'నువ్వు అలాంటి ఎమోషనల్ సీన్లు చేయాల్సిన అవసరం లేదమ్మా' అని చెప్పారు.

అలాంటి సన్నివేశాలు చేయనని చెప్పడం వల్ల కన్నడ క్లైమాక్స్ కొంచెం మార్చారు" అని చెప్పింది.