100 కోట్ల బడ్జెట్ తో రాక్షసుడు 2.. బెల్లంకొండ బాబుతో రిస్క్..!

కోలీవుడ్ లో సూపర్ హిట్టైన రాక్షసన్ సినిమాను తెలుగులో రాక్షసుడు గా రీమేక్ చేశారు.

చెప్పాలంటే బెల్లంకొండ శ్రీనివాస్ కు మొదటి కమర్షియల్ హిట్ ఇచ్చింది ఆ సినిమానే.

రమేష్ వర్మ డైరక్షన్ లో రీమేక్ అయిన రాక్షసుడు హిట్ అవడంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వల్ ప్రకటించారు.

ఈ మూవీని భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్టు టాక్.కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న రాక్షసుడు 2 సినిమాను 100 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట.

రాక్షసుడు 2 మొత్తం షూటింగ్ లండన్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.అయితే రాక్షసుడు సినిమాలో హీరోగా నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సీక్వల్ లో నటిస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఇప్పటివరకు రిలీజ్ చేసిన రెండు ప్రీ లుక్ పోస్టర్స్ లో హీరో ఎవరన్నది రివీల్ చేయలేదు.

రాక్షసుడు 2 బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తే అతని నమ్మి 100 కోట్ల బడ్జెట్ పెడితే మాత్రం రిస్క్ చేసినట్టే అవుతుంది.

అయితె ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.అందుకే ఆ రేంజ్ బడ్జెట్ కేటాయిస్తున్నారట.

మరి రాక్షసుడు 2 హీరో ఎవరు.అంత బడ్జెట్ పెడుతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్న విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉంది.

రోజు నైట్ ఈ హోమ్ మేడ్ క్రీమ్ వాడితే స్పాట్ లెస్ అండ్ బ్రైట్ స్కిన్ పొందొచ్చు.. తెలుసా?