డే కేర్ సెంటర్ లో రక్షా బంధన్ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: వీళ్ళు ఎక్కడ పుట్టారో.ఎవరి కడుపులో పుట్టినారో తెలియదు.

వీళ్లకు తోడబుట్టిన వారు ఎలాగో ఉన్నారో తెలియదు.తోడబుట్టిన వారు అసలు బతికి ఉన్నారో తెలియదు.

బందాలను, బందావ్యాలను దూరం చేసుకుని వీరంతా ఒక చోట ఉండి గత స్మృతులు నెమరువేసుకుంటూ కుమిలిపోతున్నారు.

అయితే రాఖీ పౌర్ణమి నేడు ఉండడంతో వారికి తోడబుట్టిన వారు వస్తారో మా కడుపున పుట్టిన వారు మేము ఉన్న డే కేర్ సెంటర్ కు వచ్చి రాఖీ కడుతారో అనే ఎదురుచూపులు చూడకుండా కరీంనగర్ లో గల శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఎల్లారెడ్డి పేట కు చెందిన తాజా మాజీ ఉప సర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ ల కూతురు ఒగ్గు శ్రీనిధి యాదవ్ ఎల్లారెడ్డి పేటలో గల డే కేర్ సెంటర్ లో గల వృద్దులకు బొట్టు పెట్టి రాఖీ కట్టింది.

తమ తోబుట్టువుల లేదా తమ కడుపున పుట్టిన వారు తమ వద్దకు రాకున్నా శ్రీనిధి యాదవ్ మా డే కేర్ సెంటర్ కు వచ్చి మా తోబుట్టువుల మాదిరిగా రాఖీ కట్టడం మాకు సంతోషాన్ని కలిగించిందనీ వృద్దులు శ్రీనిధి యాదవ్ ను ఆశీర్వదించారు.

అమెజాన్ ఫారెస్ట్‌లో అద్భుతమైన తెగ ప్రజలు.. 80 ఏళ్లు దాటినా బలంగా ఉంటారు..?