రక్షాబంధన్ సుముహూర్తం.. రక్షాబంధన్ విశేషాలివి!
TeluguStop.com
ప్రేమ, అనుబంధం సోదర సోదరి అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు.ఈ పండుగ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు వస్తుంది.
ఈ పండుగను అన్నా చెల్లెలు అక్క తమ్ముడు వారి మధ్య ఉన్న బంధానికి గుర్తుగా రాఖీ పండుగను నిర్వహించుకుంటారు.
ఈ క్రమంలోని రాఖీ పౌర్ణమి రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం చేసి అక్క చెల్లెలు తన అన్నా తమ్ముళ్లకు ప్రేమతో రాఖీ కడతారు.
ఈ క్రమంలోనే వారు దీర్ఘాయుష్షుతో ఉండాలని సోదరి మణి కోరుకుంటుంది.అదే విధంగా తనకు రాఖీ కట్టిన అక్క లేదా చెల్లెళ్లకు సోదరుడు విలువైన బహుమతులను కానుకగా ఇస్తుంటారు.
ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 22 వ తేదీ ఆదివారం వచ్చింది.
అయితే రాఖీ పండుగను ఎప్పుడు పడితే అప్పుడు జరుపుకోకూడదు.రాఖీ కట్టేటప్పుడు కూడా ఎంతో విలువైన సమయంలోనే రాఖీ కట్టాలని పండితులు చెబుతున్నారు.
రాఖీ ఎప్పుడు కూడా సంపూర్ణ చందమామ వచ్చిన తర్వాతనే కట్టాలని పండితులు చెబుతున్నారు.
ఇలాంటి సమయంలో రాఖీ కట్టడం వల్ల ఎంతో శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
"""/"/
ఈ ఏడాది ఆదివారం ఉదయం 6 గంటల 15 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 13 నిమిషాల వరకు రాఖీ కట్టడానికి ఎంతో అనువైన సమయం.
ఈ సమయంలో సోదరి మణి తన సోదరుడికి కుంకుమ పెట్టి తలపై అక్షింతలు వేసి రాఖీ కట్టడం వల్ల అన్నాచెల్లెళ్ల బంధం పదికాలాలపాటు బాగుంటుందని, వారి జీవితంలో ఎంతో అభివృద్ధిని సాధిస్తారని చెప్పవచ్చు.
ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి తిథి ఆగస్టు 21 శనివారం రాత్రి ఏడు గంటలకు మొదలవడంతో మనకు సంపూర్ణ చందమామ దర్శనమిస్తాడు.
ఆగస్టు 21 రాత్రి 7 గంటలకు మొదలైన రాఖీ పౌర్ణమి తిధి ఆగస్ట్ 22 ఆదివారం 5:13 వరకు ఉంటుంది.
రాఖీ కట్టే ముందు ఆ రాఖీని బియ్యంలో ఉంచి బయటకు తీసిన తర్వాత దానికి పసుపు కుంకుమ పెట్టి శివుని జపిస్తూ రాఖీ కట్టడం వల్ల అంతా శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఇంట్లోనే గోల్డెన్ గ్లో స్కిన్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!