సెట్స్ లోకి అడుగుపెట్టనున్న ‘రాఖీభాయ్’ !
TeluguStop.com
రాఖీభాయ్ .కన్నడ సినిమా ఇండస్ట్రీలో మొదలైన ఈ ప్రస్థానం ఆ తర్వాత యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది.
ఓ చిన్న సినిమాగా మొదలైన కేజీఎఫ్ చాఫ్టర్ 1 .పాన్ ఇండియా చిత్రంగా విడుదలై , విడుదలైన ప్రతిచోటా కూడా ఘనవిజయాన్ని నమోదు చేసింది.
హీరోయిజం చూపించడంలో కొత్తగా ప్రజెంట్ చేయడంతో సినిమాని అభిమానులు బాగా ఆదరించారు.రాకింగ్‌స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన కేజీయఫ్ ఛాప్టర్ 1 కి కొనసాగింపుగా రూపొందుతోన్న చిత్రం కేజీయఫ్ ఛాప్టర్ 2.
కరోనా ప్రభావంతో ఆగిన ఈ సినిమా షూటింగ్ ఈ మధ్య మళ్లీ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ షెడ్యూల్ లో చిత్ర యూనిట్ తో హీరో యష్ గురువారం నుండి జాయిన్ అవుతున్నారు.
ఈ విషయాన్ని నిర్మాత కార్తీక్ గౌడ ట్విట్టర్ ద్వారా తెలిపారు.ఈ నెలాఖరుకంతా సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని, త్వరలోనే రిలీజ్ డేట్ ఫై ఓ కీలక ప్రకటన చేస్తామని కార్తీక్ తెలిపారు.
అయితే ,సినీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో సంజయ్ దత్.అధీరా అనే విలన్ పాత్రలో నటిస్తుండగా, రవీనాటాండన్ లు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ప్యాన్ ఇండియా చిత్రంగా తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతుంది.
ప్రపంచ రికార్డులను క్రియేట్ చేసిన సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్.. (వీడియో)