దేవుళ్ళని తిట్టినందుకే కరోనా వైరస్ వచ్చిందంటున్న స్టార్ హీరోయిన్

ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే నటి రాఖీ సావంత్ ఈసారి కరోనా వైరస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాజాగా ఈ కరోనా వైరస్ పై  మాట్లాడుతూ ఓ వీడియోని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా విడుదల చేసింది.

అయితే ఇందులో తాను చైనాను పట్టిపీడిస్తున్నటువంటి కరోనా వైరస్ మహమ్మారిని అంతమొందించేందుకు చైనా వెళ్తున్నానని కచ్చితంగా ఈ కరోనా వైరస్ ని  అంతమొందించి తీరుతానని  అన్నారు.

అంతేగాక ఈ వైరస్ ని అంతమొందించడానికి నాసా సంస్థ నుంచి కొన్ని మందులను కూడా తీసుకు వచ్చానని అన్నారు.

అంతేగాక ఈ మహమ్మారి కరోనా వైరస్ తరిమికొట్టేందుకు వెళ్తున్న నేను క్షేమంగా భారత్ కి తిరిగి రావాలని ప్రార్థించాలని కోరారు.

"""/"/అంతేగాక గతంలో చైనా దేశస్తులు హిందూ సాంప్రదాయ దేవుళ్లను మరియు జీసస్ దేవుడిని నోటికొచ్చినట్లు తిట్టారని అందువల్ల ఆగ్రహానికి గురైనటువంటి దేవుళ్ళు, దేవతలు చైనా దేశంలో కరోనా వైరస్ అనే మహమ్మారిని సృష్టించారని అన్నారు.

అంతేగాక భారతదేశంలో ఉన్నటువంటి వారు కరుణ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే నిరాడంబరుడు శివుని పూజించాలని అంతేగాక పలు ప్రత్యేక పూజలు పురస్కారాలు నిర్వహించి శివ కటాక్షం పొందాలని సూచించారు.

దీంతో కొంత మంది నెటిజన్లు తమదైన శైలిలో రాఖీ కి సమాధానం ఇస్తున్నారు.

సాంకేతిక పరంగా దేశం ముందుకెళ్తున్నప్పటికీ ఇలాంటి కొంతమంది వాళ్ళ వల్ల చాలా వెనుకబాటుకు గురవుతున్నామని అన్నారు.

అంతేగాక అసలు దేవుళ్ళకి కరోనా వైరస్ కి సంబంధం ఏంటని ఎదురు ప్రశ్నలు సంధిస్తున్నారు.

డబ్బులు ఎవరికి ఊరికే రావు… అనిల్ రావిపూడి కామెంట్స్ ఆయన గురించేనా?