ప్రియుడిని పెళ్లాడిన బిగ్ బాస్ బ్యూటీ రాఖీ సావంత్.. నెట్టింట్లో ఫొటోస్ వైరల్?

బాలీవుడ్ నటి, బిగ్ బాస్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాఖీ సావంత్, బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.

ఇకపోతే కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

అలాగే ఈమె కాంట్రవర్సీల ద్వారా కూడా బాగా పాపులర్ అయింది అని చెప్పవచ్చు.

ఇది ఇలా ఉంటే గత కొంతకాలంగా రాఖీ సావంత్ ప్రియుడు అదిల్ దురానితో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.

వీరిద్దరికి సంబంధించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి.ఇది ఇలా ఉంటే తాజాగా రాఖీ సావంత్ తన ప్రియుడిని సీక్రెట్ గా పెళ్లి చేసుకొని అభిమానులకు, నెటిజన్స్ కి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.

రాఖీ సావంత్‌ ఆమె ప్రియుడు అదిల్‌ ఖాన్‌ను సీక్రెట్‌గా పెళ్లాడింది. """/"/ రాఖీ, అదిల్‌ రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.అందులో రాఖీ ప్రియుడు ఇద్దరు దండలు మార్చుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

అంతేకాకుండా వారి చేతిలో మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ ఉన్నట్లు తెలుస్తోంది.మరో ఫోటోలో రాఖీ కొన్ని పత్రాలపై సంతకం చేస్తున్నట్లుగా ఉంది.

కాగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆ పెళ్లి సర్టిఫికెట్‌ ఆధారంగా వారు గత ఏడాది పెళ్లి చేసుకున్నట్లు తీసుస్తోంది.

"""/"/ అయితే మరి వారి పెళ్లి విషయాన్ని ఎందుకు గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా ఉంచారు అన్నది తెలియాల్సి ఉంది.

కాగా రాఖీ సావంత్‌ గత ఏడాది భర్త రితేశ్‌తో విడిపోయిన విషయం తెలిసిందే.

అతని నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేసింది.అనంతరం మైసూర్‌కు చెందిన బిజినెస్‌మెన్‌ అదిల్‌తో ప్రేమలో పడ్డ ఆమె అతడిని ప్రియుడిగా మీడియాకు పరిచయం చేసింది.

ఇటీవలే బిగ్‌బాస్‌ మరాఠీ నాలుగో సీజన్‌లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది రాఖీ.ఇక తాజాగా రాఖీ సావంత్ కీ ఆమె ప్రియుడికీ పెళ్లి అయినట్లు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

డైమండ్ రత్నబాబు ఈ సంవత్సరం భారీ సినిమాతో కంబ్యాక్ ఇవ్వబోతున్నాడా..?