ముద్దులతో రెచ్చిపోయిన రాకేష్ సుజాత.. లైఫ్ లాంగ్ కలిసి ఉంటామంటూ?

జబర్దస్త్ షో ద్వారా క్రేజ్, పాపులారిటీని సొంతం చేసుకున్న సెలబ్రిటీ జోడీలలో రాకేష్ సుజాత జోడీ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.

చాలా జోడీలుగా మిగిలిపోతే ఇప్పటికే నిశ్చితార్థం జరుపుకున్న ఈ జోడీ త్వరలో పెళ్లి చేసుకుని రియల్ జోడీ అనిపించుకోనుంది.

తాజాగా ఈటీవీ ఛానల్ లో త్వరలో ప్రసారం కానున్న శ్రావణ సందడి ప్రోమో విడుదలైంది.

శ్రావణ మాసం స్పెషల్ ఎపిసోడ్ గా ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.అనసూయ మీ భార్యతో నువ్వు బాగానే ప్రశాంతంగా ఉన్నావ్ కదా అని అడగగా శివజ్యోతి భర్త ప్రశాంతంగా ఎవరున్నారని ప్రెజర్ కుక్కర్ లో కుతకుతకుతలాడుతోంది ఇక్కడ అని చెప్పుకొచ్చారు.

శివజ్యోతి హలో హలో అనగా ఆమె భర్త నువ్వు ఇక్కడే ఉన్నావా అంటూ సైలెంట్ అయిపోయారు.

రాకేష్ సుజాతకు ప్రపోజ్ చేస్తూ " ఎమోషన్ కోసం పుట్టిన ప్రేమ కాదు మనది షో కోసం షో చేసే ప్రేమ కాదు జీవితాంతం కలిసుండే ప్రేమ" అని చెప్పుకొచ్చారు.

సుజాత రాకేష్ నుదుటిపై ముద్దు పెడుతూ తన ప్రేమను వ్యక్తం చేయడంతో అక్కడ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా షాకయ్యారు.

ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రావణ సందడి పేరుతో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుందని తెలుస్తోంది.

సుజాత రాకేష్ ఒకరిపై ఒకరు ప్రేమను చూపించుకుంటున్న విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

రాకేష్ సుజాత కలకాలం సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. """/" / రాకేశ్ సుజాత కలిసి చేస్తున్న స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

శ్రావణ సందడి ప్రోమోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.ఈటీవీ ఛానల్ టాప్ 3 స్థానంలో ఉండటానికి రియాలిటీ షోలు కారణమనే సంగతి తెలిసిందే.

రాకేష్ సుజాతలకు సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.

రాజకీయంగా నష్టపోవడానికి కారణం కడియం శ్రీహరి..: తాటికొండ రాజయ్య