Rakesh Master Wife: రాకేష్ మాస్టర్ మూడో భార్యపై దాడి చేసిన ఐదుగురు మహిళలు.. ఆ తప్పు చేయడంతో?

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master ) ఇటీవల తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

ఆయన ఆకస్మిక మరణాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా యూట్యూబ్ స్టార్ రాకేష్ మాస్టర్ మూడో భార్యగా చెప్పుకునే లక్ష్మీ పై( Lakshmi ) దాడి జరిగింది.

హైదరాబాదులోని పంజాగుట్ట ఏరియాలో లక్ష్మీపై శుక్రవారం ఐదుగురు మహిళలు దాడి చేశారు.లల్లీ ( Lally ) అనే యూట్యూబర్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది.

స్నేహితుడుతో కలిసి స్కూటర్‌పై వెళ్తున్న లక్ష్మిని అడ్డగించిన లల్లీ, మరో నలుగు మహిళలు ఆమెపై దాడి చేశారు.

ఇష్టమొచ్చినట్టు కొట్టారు.జుట్టు పట్టుకుని దొర్లించి మరీ చితక్కొట్టారు.

స్థానికులు డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళలందరినీ పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆదేశించారు.

అయితే, ముందుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు( Panjagutta Police Station ) చేరుకున్న లక్ష్మి తనపై దాడి చేసిన మహిళలపై కేసు పెట్టారు.

లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.ఆ తరవాత కాసేపటికి లల్లీ, ఇతర నలుగురు మహిళలు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

వారు కూడా తమ వాదనను పోలీసులకు వినిపించారు.దీంతో లల్లీని కూడా లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా పోలీసులు సూచించారు.

"""/" / ప్రస్తుతానికి ఇద్దరి కంప్లయింట్లు తీసుకుని వారిని పంపించేశారు.యూట్యూబ్ ఛానెల్( Youtube Channel ) విషయంలో వీరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడిన లక్ష్మి.తనను రెండు నెలలుగా చంపేస్తామని బెదిరిస్తున్నారని, ఈరోజు నడిరోడ్డుపై తనపై దాడి చేశారని చెప్పారు.

నెల్లూరు కు చెందిన భారతి అనే మహిళ లక్ష రూపాయలు సుపారీ ఇచ్చి తనపై దాడి చేయించిందని ఆరోపించారు.

తనను యూట్యూబ్ వదిలిపెట్టి పోవాలని కొంతకాలంగా బెదిరిస్తున్నారని ఈరోజు పెరుగు పెద్దమ్మ, దుర్గ, లల్లీ, నెల్లూరుకు చెందిన భారతి, మరో మహిళ తనపై దాడి చేశారని వెల్లడించారు.

తనపై దాడి చేసిన మహిళలపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వాళ్లను వదలను తెలిపింది లక్ష్మి.

"""/" / మరోవైపు, లల్లీ సైతం తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పందించారు.లక్ష్మి చెప్పేవన్ని అబద్ధాలని అన్నారు.

తన మైనర్ కూతురును ఉద్దేశించి యూట్యూబ్‌లో లక్ష్మి అసహ్యకరంగా మాట్లాడిందని బూతులు తిట్టిందని అందుకే తాను లక్ష్మి చితక్కొట్టానని చెప్పారు.

లక్ష్మి మాటల కారణంగా తన కూతురు స్కూలుకు వెళ్లడం మానేసిందని, ఆమె భవిష్యత్తు పాడైందని లల్లీ ఆరోపించారు.

తాను లక్ష్మిని కొట్టినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నానని గతంలో తనపై, తన కూతురిపై లక్ష్మి చేసిన వ్యాఖ్యలను, బూతు పురాణాన్ని పోలీసులకు చూపించానని చెప్పారు.

ఈ లడ్డూను రోజుకొకటి చొప్పున తింటే మోకాళ్ళ నొప్పులకు గుడ్ బై చెప్పవచ్చు..!