Rakesh Master Movies: రాకేష్ మాస్టర్ టాలీవుడ్ లో ఆ స్టార్ హీరోల మూవీలకు కొరియోగ్రఫీ చేసారా?

తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది.ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫ్ రాకేష్ మాస్టర్( Rakesh Master ) తుదిశ్వాస విడిచారు.

గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తాజాగా వైజాగ్ నుంచి వస్తున్న క్రమంలో వడదెబ్బకు గురి కావడంతో ఆయన అనారోగ్యం మరింత క్షీణించింది.

దాంతో వెంటనే ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఆయన మరణవార్తను ఆయన అభిమానులు నెటిజన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.ఇప్పటికీ ఆయన మరణం షాకింగ్ గానే ఉందని చెప్పవచ్చు.

రాకేష్ మాస్టర్ మరణించిన సందర్భంగా ఆయన జ్ఞాపకాలను అభిమానులను గుర్తు చేసుకుంటున్నారు.ఇక సెలబ్రిటీలు ఆయనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కాగా చాలామందికి రాకేష్ మాస్టర్ కెరియర్ గురించి అసలు తెలియదు.ఆయన దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రఫీ అందించారు అంటే ఆశ్చర్యం వేయక మానదు.

90వ దశకం చివరి నుంచి రాకేష్ మాస్టర్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.హీరో మాస్ మహారాజ రవితేజ( Hero Raviteja ) తనని కెరీర్ ఆరంభంలో బాగా ప్రోత్సహించారని రాకేష్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

"""/" / స్టార్ హీరోలు, చిన్న, మీడియం ఇలా అన్ని చిత్రాలు కలుపుకుని రాకేష్ మాస్టర్ దాదాపు 1500 చిత్రాలకు పనిచేశారు.

మొదట మనసిచ్చాను సినిమాలో వెండితెరకి మా వందనాలు అనే సాంగ్ కి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ( Rakesh Master Choreography ) అందించారు.

ఆ సాంగ్ లో యంగ్ రాకేష్ మాస్టర్ ని రవితేజ పక్కనే డ్యాన్స్ చేయడం చూడవాచ్చు.

ఆ సాంగ్ తనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది అని రాకేష్ మాస్టర్ తెలిపారు.

ఆ తర్వాత మహేష్ బాబు( Mahesh Babu ) చేత కూడా రాకేష్ మాస్టర్ అదిరిపోయే స్టెప్పులు వేయించారు.

యువరాజు చిత్రంలో సూపర్ హిట్ సాంగ్ గుంతలకడి గుంతలకడి గుమ్మా అనే సాంగ్ ఆరంభంలో మహేష్ శ్రీకృష్ణుడి గెటప్ లో కనిపిస్తారు.

ఆ పార్ట్ తో పాటు సాంగ్ లో మరికొంత భాగం రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ ఇచ్చారు.

"""/" / అలాగే హీరో వేణు చిత్రాలు, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోల చిత్రాలకు ఎన్నో పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాకేష్ మాస్టర్ కెరియర్ ను పీక్స్ కి తీసుకెళ్లన చిత్రం మాత్రం దేవదాసు అని చెప్పవచ్చు.

దేవదాసు చిత్రంలో పలు పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.తర్వాత లాహిరి లాహిరి లాహిరిలో, సీతారామరాజు ఇలా ఎన్నో చిత్రాలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.

అలా టాలీవుడ్లో టాప్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీని అందించి స్టార్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

కానీ ఆ తర్వాత కాలంలో తోటి కొరియోగ్రాఫర్ ల వల్లే తన జీవితం నాశనం అయ్యింది అన్న విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రాకేష్ మాస్టర్.

కాగా ఆట, ఢీ లాంటి షోలు రాకేష్ మాస్టర్ కి మరింతగా గుర్తింపు తెచ్చి పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?