ప్రభుదేవాకు పబ్లిక్ గా చాలెంజ్ చేసిన రాకేష్ మాస్టర్.. అసలు గొడవ ఏంటంటే?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది.ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master ) మరణ వార్త ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.
రాకేష్ మాస్టర్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో పనిచేశారు.అయితే ఈయన గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
ఇక ఆదివారం ఉదయం రాకేష్ మాస్టర్ విరోచనాలతో బాధపడుతూ ఉండగా ఈయనని కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇలా గాంధీ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నటువంటి రాకేష్ మాస్టర్ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు.
"""/" /
ఇలా రాకేష్ మాస్టర్ మరణించడంతో ఇండస్ట్రీకి చెందినటువంటి ఎంతోమంది సెలబ్రిటీలు తోటి కొరియోగ్రాఫర్లు ఈయన మృతికి సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మ శాంతించాలని కోరుకున్నారు.
ఇకపోతే రాకేష్ మాస్టర్ మరణించడంతో ఈయనకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు సంపాదించుకున్నటువంటి కొరియోగ్రాఫర్ ప్రభుదేవాకు ( Prabhudeva ) ఈయన పబ్లిక్ గా ఛాలెంజ్ విసిరారు.
అలా వీరిద్దరి మధ్య ఈయన కెరియర్ స్టార్టింగ్ లోనే గొడవ జరిగిందని తెలుస్తోంది.
అయితే మరి ఆ గొడవ ఏంటి అనే విషయానికి వస్తే. """/" /
రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఆట( Aata ), ఢీ ( Dhee) వంటి డ్యాన్స్ షోలతో కెరీర్ ని స్టార్ట్ చేసిన ఈయన.
ఢీలో కొనసాగుతున్న సమయంలో ప్రభుదేవా పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలిచారు.ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణయితగా ఉన్నటువంటి ప్రభుదేవా పై ఈయన ఆరోపణలు చేశారు.
తెలుగు డ్యాన్సర్లకు అన్యాయం జరుగుతుందని, తెలుగు తెలిసిన వారే ఇక్కడ డాన్స్ షోలకు జడ్జిలుగా వ్యవహరించాలని,కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే ఇక్కడ పాల్గొని మన దమ్ము ఏంటో ప్రపంచానికి తెలియచేయాలి అంటూ అప్పట్లోనే ఈయన ప్రభుదేవా మాస్టర్ పై గట్టిగా వాదిస్తూ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.
ఇలా కెరియర్ మొదట్లోనే ప్రభుదేవాతో రాకేష్ మాస్టర్ మధ్య జరిగిన గొడవకు సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.
My Jackpot Review And Player Reputation: What Canadian Beginners Should Know