బిగ్ బాస్ ఓటీటీలోకి రాకేష్ మాస్టర్.. ఈసారి షో మాములుగా ఉండదుగా!

తెలుగు బుల్లితెరపై అత్యధిక రేటింగ్స్ సంపాదించుకుని నెంబర్ వన్ రియాలిటీ షో గా నిలిచిన బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అన్ని భాషలలో ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.

ఇక తెలుగులో ఇప్పటికే ఈ కార్యక్రమం ఏకంగా 5 సీజన్లను పూర్తి చేసుకుంది.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ఇకపై ఓటీటీలోకి వస్తున్న విషయాన్ని నాగార్జున ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇకపోతే 24 గంటల పాటు ఈ కార్యక్రమం ప్రసారం అయ్యే విధంగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

బిగ్ బాస్ ఓటీటీ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ప్రసారం కానుందని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నపటికీ ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన లేదు.

అయితే ఇప్పటికే కంటెస్టెంట్ ల ఎంపిక కూడా పూర్తి అయిందని వార్తలు వినబడుతున్నాయి.

ఈ క్రమంలోనే బిగ్ బాస్  ఓటీటీలోకి ఢీ-10' విజేత రాజు, దుర్గారావు, 'సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌'వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ వైష్ణవి, వరంగల్‌ వందన, యాంకర్‌ ప్రత్యూష పేర్లు వినపడుతున్నాయి.

"""/" / తాజాగా ఈ కార్యక్రమానికి కాంట్రవర్సీ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కంటెస్టెంట్ గా వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఈయన ఈ మధ్యకాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఇలాంటి కాంట్రవర్సీ వ్యక్తిని బిగ్ బాస్ కార్యక్రమానికి పంపిస్తే షో మామూలుగా ఉండదని పలువురు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Mahesh Babu , Kasturi : మహేష్ కి జోడి గా చేయాల్సిన వయసు నాది..తల్లిగా ఎలా చేయగలను : కస్తూరి