ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న రాకేష్ మాస్టర్

రాకేష్ మాస్టర్.సోషల్ మీడియా గురించి కాస్తో, కూస్తో తెలిసి వారికి ఎవరికా ఇతడు ఎక్కడో ఒక చోట తగిలే ఉంటాడు.

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ కొరియోగ్రఫర్లుగా కొనసాగుతున్న వారందరికీ ఇతడే గురువు అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు.

తన దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న పలువురు ఇప్పుడు చాలా మంచి పొజిషన్ కు వెళ్లారు.

తన పరిస్థితి మాత్రం రోజు రోజుకూ దిగజారుతోంది.గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా పలువురు నటీమణులతో పాటు నటులు, కొరియోగ్రఫర్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

తీవ్ర పదజాలంతో నిప్పులు చెరుగుతున్నారు.అయితే కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో రాకేష్ మాస్టర్ రెండో భార్యతో పాటు కొడుకుపై కొందరు పీకే అభిమానులు దాడికి యత్నించారు.

దీంతో అప్పటి నుంచి తన భార్యతో పాటు కుమారుడు అతడికి దూరంగానే ఉంటున్నారు.

తాము బతికి ఉన్నా చనిపోయినట్లుగానే అనుకోవాలని తన భార్య తేల్చి చెప్పింది.ఏం చేయాలో తెలియక కొంత కాలంగా ఒంటరిగానే ఉన్నాడు రాకేష్ మాస్టార్.

తాజాగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు రాకేష్ మాస్టార్.రాజుల కుటుంబానికి చెందిన ఈ మహిళతో కొంత కాలంగా కలిసి ఉంటున్నట్లు చెప్పాడు.

అంతే కాదు.తన మూడో భార్యతో కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ ఆఫీస్ కు ఇంటర్వ్యూకు వచ్చాడు.

ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన జంటకు మంగళహారతులతో స్వాగతం పలికారు.తమ ఇద్దరి మనసులు కలిసినందు వలనే ఇద్దరం కలిసి ఉంటున్నట్లు రాకేష్ మాస్టర్ చెప్పాడు.

తాము వివాహం చేసుకోలేదని.సహజీవనం మాత్రమే చేస్తున్నట్లు వెల్లడించాడు.

తనకు అన్ని వేళలా చేదోడు వాదోడుగా ఉంటుందన్నాడు.చివరకు మద్యం కావాలన్నా తనే తెచ్చి పోస్తుందని చెప్పాడు.

కష్ట సుఖాల్లో కలిసి ఉంటున్నందునే ఇద్దరం హ్యాపీగా ఉంటున్నట్లు చెప్పారు.తనను అమ్మలా చూసుకుంటున్నట్లు చెప్పారు.

డైరెక్టర్ శంకర్ భవిష్యత్తును డిసైడ్ చేయనున్న ఇండియన్3 మూవీ.. ఏం జరిగిందంటే?