జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నన్ను చంపడానికి చూస్తున్నారంటున్న డ్యాన్స్ మాస్టర్...

గత కొద్దికాలంగా సీనియర్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.

అయితే ఇటీవల కాలంలో లో రాకేష్ మాస్టర్ యూట్యూబ్ చానల్లో నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ పై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలనీ అందరూ అపార్థం చేసుకున్నారు.

దీంతో రోజు అతడిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని అన్నారు.అంతేగాక చంపుతానని బెదిరిస్తున్నారు.

అయితే ఇదిలా ఉండగా మరో పక్క ఇటీవలే శ్రీ రెడ్డి ఇలాంటి కూతురు తనకు ఉంటే కచ్చితంగా పెట్రోలు పోసి తగలబెడుతాను అని పలు తీవ్ర వ్యాఖ్యలు చేసాడు రాకేష్ మాస్టర్.

దీంతో శ్రీ రెడ్డి కూడా రాకేష్ మాస్టర్ పై ఇదే రీతిలో విరుచుకు పడుతోంది.

అయితే తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో వేధిస్తోంది అంటూ రాకేష్ మాస్టర్ హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

ఇందులో భాగంగా తనకు శ్రీ రెడ్డి మరియు ఎన్టీఆర్ అభిమానుల నుంచి ప్రాణహాని ఉందని కాబట్టి తనకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరాడు.

"""/"/ దీంతో బాధితుడు రాకేష్ మాస్టర్ తెలిపిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అయితేఈ విషయం ఉండగా గగతంలో మెగాస్టార్ చిరంజీవిపై కూడా పలు రకాల వ్యాఖ్యలు చేసి మెగా అభిమానుల ఆగ్రహానికి రాకేష్ మాస్టర్ గురయ్యాడు.