వైసీపీ ప్రభుత్వంపై రాజ్యసభ సభ్యుడు కనకమెడల రవీంద్ర కుమార్ సీరియస్ వ్యాఖ్యలు..!!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతే అంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ సుప్రీంకోర్టులో తెలుసుకోవడానికి పిటిషన్ వేయడం తెలిసిందే.
ఈ వ్యవహారంపై టీడీపీ కీలక నాయకుడు రాజ్యసభ సభ్యుడు కనకమెడల రవీంద్ర కుమార్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
హైకోర్టు మాదిరిగానే సుప్రీంకోర్టులో కూడా వైసీపీ కి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని తెలియజేశారు.
అమరావతి రైతులు చేపడుతున్న మహా పాదయాత్రకి మద్దతు తెలిపిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
చట్ట సభలను తక్కువ చేసే రీతిలో న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వలేదని పేర్కొన్నారు.రాజధాని నిర్మాణం చేపట్టకుండా ఆరు నెలలు ఆగి ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళటం పట్ల సీరియస్ అయ్యారు.
ఏపీకి అమరావతి రాజధాని విషయంలో ఒక్క టిడిపి నేతలు మాత్రమే బిజెపి నేతలు సైతం మద్దతు తెలుపుతూ ఉన్నారు.
ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ సుప్రీంకోర్టుకి వెళ్ళటం పట్ల టిడిపి తో పాటు బిజెపి సైతం సీరియస్ వ్యాఖ్యలు చేస్తూ ఉంది.
తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన .. ఆమెనూ తప్పిస్తున్నారా ?