ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం..!!
TeluguStop.com
రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు( Delhi Ordinance Bill ) ఆమోదం లభించింది.
సోమవారం నాడు ఓటింగ్ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా 131 మంది వ్యతిరేకంగా 102 మంది ఓటు వేశారు.
బిల్ పై ఓటింగ్ జరుగుతున్న సమయంలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో స్లిప్పుల ద్వారా ఓటింగ్ నిర్వహించడం జరిగింది.
ఈ క్రమంలో ఉభయ సభల్లో ఆమోదం లభించటంతో కేంద్రం బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించనుంది.
రాష్ట్రపతి ఆమోదంతో ఢిల్లీ ఆర్డినెన్స్ చట్టం కానుంది.బిల్లుపై చర్చ సందర్భంగా అమిత్ షా( Amit Shah ) మాట్లాడుతూ ఢిల్లీ ఆర్డినెన్స్ అంశంలో సుప్రీంకోర్టు( Supreme Court ) తీర్పును ఉల్లంఘించలేదని పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో వ్యవస్థలను మెరుగుపరచడమే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఉద్దేశమని.అమిత్ షా స్పష్టం చేశారు.
ఢిల్లీలో అవినీతిని పారదోలటమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే ఢిల్లీ సర్వీసుల బిల్లుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ పార్టీలు మద్దతు తెలిపాయి.
అంతేకాదు ఈ బిల్లుకు ఎన్డీఏకు.బీఎస్పీ మరియు బీజీడీ పార్టీలు మద్దతు తెలపడం విశేషం.
ఈ ఆహారాలు ఉడకబెట్టి తింటేనే ఎక్కువ ఆరోగ్యకరం.. తెలుసా?