పవన్ కు అహం ఎక్కువ.. పవన్ పూనమ్ మధ్య జరిగిందిదే.. రాజు రవితేజ కామెంట్స్ వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయితేజ్ ( Pawan Kalyan, Saitej )తో కలిసి నటించిన బ్రో మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని మరో మూడు రోజుల్లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో బిజినెస్ చేసిన ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పవన్ కు అత్యంత సన్నిహితులు, జనసేన మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయిన రాజు రవితేజ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న రాజు రవితేజ( Raju Ravi Teja )తాను మళ్లీ జనసేనలోకి వెళ్లే ఛాన్స్ లేదని అన్నారు.

పవన్ కళ్యాణ్ కూడా రమ్మని పిలవడని ఆయన చెప్పుకొచ్చారు.పవన్ కళ్యాణ్ అహంకారి అని రాజు రవితేజ కామెంట్లు చేశారు.

పవన్ లో అహం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.చెప్పింది చేయడం చేసేది చెప్పడం పవన్ కు తెలియదని ఆయన చెప్పుకొచ్చారు.

పవన్ పూనమ్ గొడవలో నేను మీడియేటర్ అని చాలామంది అనుకుంటారని రాజు రవితేజ అన్నారు.

"""/" / పవన్ పూనమ్ టాపిక్ లో నేను ఎంట్రీ కాలేదని ఆయన అన్నారు.

ఒకే ఒకసారి పవన్ తో పూనమ్ గురించి చర్చించానని రాజు రవితేజ వెల్లడించారు.

పవన్ పూనమ్ మధ్య ఏం జరిగిందో నాకు పవన్ ద్వారా ఆ సమయంలో తెలిసిందని అయితే అది పవన్ పర్సనల్ మ్యాటర్ కాబట్టి నేను ఆ విషయాలను బహిరంగంగా చెప్పడం సరికాదని రాజు రవితేజ అన్నారు.

పూనమ్ తో తనకు పరిచయం లేదని ఆమెతో మాట్లాడలేదని ఆయన పేర్కొన్నారు. """/" / ప్రస్తుత పవన్ ధోరణి వల్ల ఆయన రాజకీయాల్లో ( Politics )సక్సెస్ కావడం సులువు కాదని రాజు రవితేజ అన్నారు.

ఏపీ రాజకీయాల్లో పవన్ థర్డ్ రన్నర్ అని రాజు రవితేజ వెల్లడించారు.జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ రేసులోకి వస్తే పవన్ స్థానం మారుతుందని ఆయన అన్నారు.

రాజు రవితేజ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2024లో టాలీవుడ్ ను ముంచేసిన డిజాస్టర్లు ఇవే.. ఈ హీరోల కెరీర్ కు కష్టమేనా?