పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కే దిక్కులేదు.. రాజు రవితేజ సంచలన వ్యాఖ్యలు వైరల్!
TeluguStop.com
రాజు రవితేజ( Raju Ravi Teja )ఈ పేరు గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఈ పేరు రాజకీయాల్లో ప్రత్యేకం.కాగా రాజు రవితేజ గతంలో పవన్‌కు అత్యంత సన్నిహితుడు, జనసేన మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా.
ఒక రెండు కాదు ఏకంగా 12 ఏళ్ల పాటు పవన్‌తో రాజు రవితేజ కలిసి నడిచారు.
తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2019లో పార్టీకి గుడ్‌బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
తాజాగా ఏపీ రాజకీయాలపై( AP Politics ) ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ప్రస్తుతం పవన్ చేస్తున్న రాజకీయాలు ఎలా ఉన్నాయి? గత ఐదేళ్లలో జనసేన ప్రభావం ఎంటి? పవన్‌కు పెద్ద దిక్కు లేకుంటే ఎలాంటి పనిచేయలేడా? పవన్ పిరికివాడా లేదా ధైర్యవంతుడా.
పవన్ విషయంలో జనసేన క్యాడర్‌కు( Janasena Cader ) నచ్చనిదేంటి.? ఏపీలో పవన్ ఇమేజ్ పడిపోయిందా? భవిష్యత్‌లో పవన్ సినిమాల పరిస్థితి ఏంటి? జనసేనకు 21 సీట్లు ఉంటే 16 మంది అభ్యర్థుల బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? 2024లో ఏపీలో అధికారం ఎవరిది? ఇలా ఎన్నో ప్రశ్నలకు రాజు రవితేజ ఈ పూర్తి వీడియోలో సమాధానం ఇచ్చారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.పవన్ కళ్యాణ్ సమాజాన్ని విచ్ఛిన్నపరిచే, విభజించే శక్తి లాగా మారుతున్నారు.
జనసేన పార్టీ ఆవిర్భావం( Janasena Party ) నుంచే పార్టీ కోసం నేను ఎంతో కష్టపడ్డాను.
మరి ఎంతో చేద్దామనుకున్నాను.కానీ నా ఆలోచనలకు పూర్తి వ్యతిరేకంగా వెళ్తున్నారు.
ఇక అలాంటి వ్యక్తితో ఎక్కువ కాలం కొనసాగలేక పార్టీకి రాజీనామా చేశాను అని తెలిపారు రాజు రవితేజ.
పార్టీ కోసం, పార్టీ బాగు కోసం ఎన్నో ఆలోచనలు చేశాను. """/" /
అందులో ఒకటి కూడా పవన్ అమలు చేయలేదు.
పవన్ కళ్యాణ్ లో వివేకం చచ్చిపోయింది.వివేకం నశించడంతోనే మనిషి నాశనం మొదలవుతుంది.
ఒకప్పుడు పవన్ జీవితంలో పాండిత్యం,జ్ఞానం, మంచితనం, దయా, కరుణ మాత్రమే ఉండేవి.కానీ ఇప్పుడు కుట్ర , మోసం, ద్వేషం, అబద్దాలు నిండిపోయాయి.
ప్రస్తుతం అపద్ధపు బ్రతుకు బ్రతుకుతున్నాడు అంటూ కాస్త ఘాటుగా విమర్శించారు.ఏ వ్యాధినైతే నివారించాలని మనం ప్రజా జీవితంలోకి అడుగు పెట్టాము.
మీరే ఆ వ్యాధిగా మారారు.ఇష్టం లేకపోయినప్పటికీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, పార్టీకి తొలి ప్రధాన కార్యదర్శిగా ఉండమని కోరారు.
దాదాపు 12 ఏళ్లు మీ వెంటే నడిచాను. """/" /
పార్టీకి సంబంధించిన అన్ని విషయాలు మీతో చర్చించాను కానీ మీ రాజకీయాలు విషపూరితంగా మారాయి.
కులాలు, మతాల ప్రస్తావన తీసుకొచ్చి అబద్దాలు, అసభ్యకర భాషతో మాట్లాడుతున్నారు.ఇక పొత్తు పెట్టుకోవడం వల్ల మీరు ఇంకా దరిద్రంగా మారిపోయారు అంటూ విమర్శించారు రాజు రవితేజ.
ఇకపోతే తన ప్రాణ స్నేహితుడైన పవన్ కళ్యాణ్ తనకు ఇష్టం లేని పెళ్లి జరిపించి తన జీవితాన్ని కూడా నాశనం చేశారంటూ కూడా విమర్శించారు రాజు రవితేజ.
కారు బానెట్‌పై చిన్నారి కూర్చోబెట్టి రోడ్డుపై ఏకంగా..? (వీడియో)