ఇంటర్వ్యూకు వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు.. రజనీ ప్రశ్నకు షాకైన లత..

రజనీకాంత్.సౌత్ ఇండియన్ సూపర్ స్టార్.

కండక్టర్ స్థాయి నుంచి అద్భుత నటుడిగా ఎదిగి అదరహా అనిపించుకున్నాడు.తమిళ సినిమా పరిశ్రమతో పాటు తెలుగు, కన్నడలో తన హవా కొనసాగించాడు.

ఈ సూపర్ స్టార్ మది దోచుకున్న వనిత లత.వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వీరికి ఇద్దరు అమ్మాయిలు.ఐశ్వర్య, సౌందర్య.

రజనీకాంత్ ఎక్కడికి వెళ్లినా తన భార్య, పిల్లలో ఆయన వెంట ఉండాల్సిందే.నిజానికి లత.

రజనీ ఓ సినిమా షూటింగ్ లో ఉన్న ఆయనను కలిసింది.తన కాలేజీ మ్యాగజైన్ కోసం ఇంటర్వ్యూకని తనను మీట్ అయ్యింది.

ఆ ఇంటర్వ్యూ సమయంలోనే ఇద్దరి అభిరుచులు కలిశాయి.ఇంటర్వ్యూ కాగానే పెళ్లి చేసుకుంటావా? అని రజనీ అడిగాడు.

సూపర్ స్టార్ ఆ మాట అనడంతో తను షాక్ అయ్యింది.ఆ తర్వాత ఎంతో సంతోష పడింది.

వెంటనే తన తల్లిదండ్రులతో మాట్లాడాలని చెప్పింది.సినిమా పరిశ్రమలోని కొందరు పెద్దలతో ఆమె తల్లిదండ్రులతో మాట్లాడించాడు.

వారు కూడా ఈ ప్రపోజల్ కు ఒప్పుకున్నారు.1981 ఫిబ్రవరి 26న తిరుపతిలో లతను పెళ్లి చేసుకున్నాడు.

బంధుమిత్రులు, సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇద్దరు కలిసిపోయారు.

సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. """/"/ ప్రస్తుతం రజనీ, లత వివాహం జరిగి నాలుగు దశాబ్దాలు దాటింది.

పలువురు సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు వారికి శుభాకాంక్షలు చెప్పారు.ఈ సందర్భంగా ఆయన కూతరు ఐశ్వర్య ఓ ఫోటోను షేర్ చేసింది.

అందులో లత రజనీ ముఖంపై ఎరుపు రంగు లిప్ స్టిక్ తో పేయింటింగ్ వేస్తున్నట్లు ఉంది.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. """/"/ రజనీ, లత సంసార జీవితంలో ఏనాడు చిన్న పొరపొచ్చాలు కూడా రాలేదు.

వారి అన్యోన్య దాంపత్యం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు.వారిద్దరూ ఎంతో అద్రుష్టవంతులు అని కొనియాడుతూనే ఉంటారు చాలా మంది సినిమా జనాలు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి13, సోమవారం 2025