రజనీకాంత్ ఖాతాలో అరుదైన ఘనతలు.. క్రేజీ రికార్డులు ఆయన సొంతమయ్యాయా?

సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) గురించి మనందరికీ తెలిసిందే.రజనీకాంత్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.

ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా ఉన్నారు రజనీకాంత్.

కాగా రజనీకాంత్ సినిమా విడుదల అవుతుంది అంటే థియేటర్ ల వద్ద పండగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది.

ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే రజనీకాంత్ తాజాగా నటించిన చిత్రం వెట్టేయాన్.

( Vettaiyan ) ఇటీవల విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

అంతేకాకుండా విడుదలైన నాలుగు రోజుల్లోనే 240 కోట్ల గ్రాస్ తెచ్చింది. """/" / దీంతో ర‌జ‌నీకాంత్ కెరీర్ లో 200 కోట్ల క్ల‌బ్ లో చేరిన ఏడ‌వ చిత్రంగా వెట్టేయాన్ సినిమా నిలిచింది.

అయితే ఈ సినిమా కంటే ముందు రజనీకాంత్ నటించిన పేట, దర్బార్, ఎంథిరన్, కబాలి,జైలర్, రోబో 2.

0 లాంటి సినిమాలు విడుదల అయ్యి 200 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే.

కేవలం వ్యాప్తంగానే కాకుండా చైనా, మ‌లేషియా, జ‌పాన్, కొరియా దేశాల్లో , థాయ్ లాండ్ దేశాల్లో సూప‌ర్ స్టార్ ఇమేజ్ పీక్స్ లో ఉంది.

ఆయ‌న స్టైల్ కి ఇండియ‌న్స్ మాత్ర‌మే కాదు.దేశ విదేశాల్లోనూ అభిమానులు ఉన్నార‌ని ఎన్నో సినిమాలు రుజువు చేసాయి.

"""/" / అందులో తొలుత బీజం వేసింది ముత్తు చిత్రం.అందులో త‌లైవార్ స్టైల్ కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు.

అప్పటి నుంచి ర‌జ‌నీ సినిమాలు విదేశాల్లో క్ర‌మం త‌ప్ప‌కుండా రిలీజ్ అవుతుంటాయి.ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ హీరోగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శక‌త్వంలో కూలీ చిత్రంలో( Coolie Movie ) న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

గ్యాంగ్ స్ట‌ర్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది.ఇందులో తైల‌వా గోల్డ్ స్మ‌గ్ల‌ర్ పాత్ర పోషిస్తున్నారు.

ఈ పాత్ర గ‌నుక క‌నెక్ట్ అయిందంటే? మళ్లీ వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్ల వ‌ర‌దే అని చెప్పాలి.

మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి మరి.

రజనీకాంత్ ఖాతాలో అరుదైన ఘనతలు.. క్రేజీ రికార్డులు ఆయన సొంతమయ్యాయా?