సినిమాల విషయంలోనూ రజినీకాంత్‌ ఏదో బాంబు పేల్చబోతున్నాడా?

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ 20 ఏళ్లుగా రాజకీయాల్లోకి వస్తాను అంటూ ఊరించాడు.టైం వచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానంటూ చెబుతూ వచ్చిన రజినీకాంత్‌ ఈ ఏడాది రాజకీయాల్లోకి రావడం ఖాయం అంటూ అంతా అనుకున్నారు.

ఆయన కూడా ప్రకటించాడు.డిసెంబర్‌ 31వ తేదీన పార్టీని ప్రకటిస్తానంటూ రజినీకాంత్‌ ప్రకటించాడు.

జనవరిలో పార్టీని ముందుకు తీసుకు వెళ్లేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తానంటూ కూడా ప్రకటించాడు.ఇంతలో తన ఆరోగ్యం బాగుండటం లేదు.

నేను రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటూ ఉండగా దేవుడు అనారోగ్యం కలిగించి హెచ్చరించాడు కనుక నేను ఇకపై రాజకీయాల్లోకి వచ్చేది లేదు అంటూ ప్రకటించాడు.

ఈ సమయంలో తన ఆరోగ్యం తనకు ప్రాముఖ్యత అన్నాడు. """/"/ రజినీకాంత్‌ రాజకీయాల విషయంలో ఎలాంటి బాంబు అయితే పేల్చాడో అదే సినిమాల విషయంలో పేల్చుతాడేమో అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాబోయే రోజుల్లో రజినీకాంత్ సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటాడని అంటున్నారు.రాజకీయాల్లోకి రావద్దనే నిర్ణయం తీసుకున్న రజినీకాంత్‌ ఇప్పటికే కమిట్‌ అయిన సినిమాలను పూర్తి చేసి ఆ తర్వాత సినిమాలకు గుడ్‌ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

రజినీకాంత్‌ సినిమాల విషయంలో ఇప్పటికే చాలా వరకు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.2022 తర్వాత రజినీకాంత్‌ సినిమాలకు కూడా పూర్తిగా బై బై చెప్పే అవకాశం ఉందంటున్నారు.

ఆయన అరోగ్యం రీత్యా సినిమాలను కూడా వదిలేయాలని నిర్ణయించుకున్నాడట.అది ఎంత వరకు నిజం అనేది ఆయన నోటి నుండి వస్తే కాని తెలియదు.

ప్రస్తుతం రజినీకాంత్ అన్నాత్తే సినిమా చేస్తున్నాడు.ఇటీవల యూనిట్‌ సభ్యుల్లో కరోనా నిర్థారణ అవ్వడంతో సినిమాను వాయిదా వేయడం జరిగింది.

వచ్చే నెలలో మళ్లీ షూటింగ్‌ పునః ప్రారంభం చేసే అవకాశం ఉంది.

మంగళగిరిలో స్త్రీ శక్తి కార్యక్రమంలో లోకేష్ పై నారా బ్రాహ్మణి సంచలన వ్యాఖ్యలు..!!