వరల్డ్ కప్ 100% మనదే రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు..!!

స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ ( ODI World Cup )టోర్నీలో భారత్ జైత్రయాత్ర సాగుతున్న సంగతి తెలిసిందే.

బుధవారం ముంబాయి వేదికగా మొదటి సెమిస్ లో కివీస్ పై భారత్ ఘనవిజయం సాధించింది.

దీంతో భారత్ ఫైనల్ కి చేరుకోవటం తెలిసిందే.నవంబర్ 19వ తారీకు గుజరాత్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

అయితే భారత్ ఫైనల్ చేరుకోవటంపై సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) స్పందించారు.

కచ్చితంగా 100% భారత్ వరల్డ్ కప్ గెలుచుకుంటుందని జోష్యం చెప్పారు.కచ్చితంగా ఈసారి కప్ మనదే అని అన్నారు.

ఇదే సమయంలో సెమీఫైనల్ లో న్యూజిలాండ్( New Zealand ) తో జరిగిన మ్యాచ్ చూస్తుండగా మొదట కాస్త టెన్షన్ పడ్డాను.

అని రజనీకాంత్ స్పష్టం చేశారు.విలియమ్సన్, మిచెల్ ఇద్దరూ మంచి పార్టనర్ షిప్ తో ఆడుతున్న సమయంలో చాలా కంగారు పడ్డాను.

వాళ్ళిద్దరూ క్రీజ్ లో ఉన్న గంటన్నర సేపు ఒకటే టెన్షన్.ఆ తరువాత షమీ వీజ్రభించి వరుసగా వికెట్లు తీయడంతో ఊపిరి పీల్చుకున్న.

ఈసారి ఇండియా ఖచ్చితంగా వరల్డ్ కప్ గెలుస్తుంది అని రజినీకాంత్ స్పష్టం చేశారు.

స్వదేశంలో 2011లో ధోని సారధ్యంలో వరల్డ్ కప్ గెలవడం జరిగింది.మళ్లీ ఇప్పుడు దాదాపు పది సంవత్సరాల తర్వాత స్వదేశంలో జరుగుతున్న ఈ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత్ ఫైనల్ కి చేరుకోవటంతో ఈసారి కప్ కచ్చితంగా గెలవాలని క్రికెట్ ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు.

ట్రంప్‌కే ఓటేయ్యండి.. ప్రవాస భారతీయులకు తులసి గబ్బార్డ్ పిలుపు