ఆ నటుడు నన్ను చూపుతోనే భయపెట్టాడు.. రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ నటుడు హీరో రానా(rana) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రానా.ఈ సినిమాతో రానా క్రేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు.
చాలామందికి రానా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా బాహుబలి(Bahubali).ఇకపోతే రానా ప్రస్తుతం అడపదడపా సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగానే రజినీకాంత్(rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన వేట్టయాన్ సినిమాలో కూడా రానా కీలక పాత్ర పోషించారు.
ఇకపోతే తాజాగా ఈ మూవీ ఆడియో లాంచ్ సందర్భంగా రానా గురించి స్వయానా రజినీకాంత్ ఒక రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు.
"""/" /
ఈ సందర్భంగా రజనీకాంత్(rajinikanth) మాట్లాడుతూ.రానా రామానాయుడి(Rana Ramanaidu) మనవడిగా చిన్నప్పటి నుంచి తెలుసు.
అప్పట్లోనే షూటింగ్‌కి వచ్చేవాడు.ఫుల్ జాలీగా ఉండేవాడు.
కానీ ఇప్పుడు యాక్టింగ్ చేస్తూ సీరియస్ లుక్ ఇచ్చేవాడు.అప్పుడు నిజంగా నేను భయపడేవాడిని అని రజినీకాంత్ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇకపోతే రజనీకాంత్ నటించిన వేట్టయన్ సినిమా విషయానికి వస్తే.ఈ సినిమాలో రజినీతో పాటు అమితాబ్, రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుసరా విజయన్ (Amitabh, Rana, Fahad Fazil, Manju Warrier, Ritika Singh, Dusara Vijayan)ఇలా చాలామంది నటీనటులు నటించిన విషయం తెలిసిందే.
"""/" /
అనిరుద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.ఈ సినిమా రేపు అనగా అక్టోబర్ 10వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇప్పటికి ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు పోస్టర్లు, టీజర్ లు ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి.
ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
జనసేన లోకి వారంతా క్యూ … టీడీపీ నేతల్లో ఆగ్రహం ?