రజినికాంత్ 'పెద్దన్న'.. రన్ టైం షాక్..!

సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా డైరక్టర్ శివ డైరక్షన్ లో వస్తున్న సినిమా అన్నాత్తే.

ఈ సినిమాను తెలుగులో పెద్దన్నగా రిలీజ్ చేస్తున్నారు.దీపావళి కానుకగా నవంబర్ 4న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా రన్ టైం రివీల్ అయ్యింది.

రజినికాంత్ పెద్దన్న సినిమా 2 గంటల 43 నిమిషాల రన్ టైం తో వస్తుందని తెలుస్తుంది.

సినిమాలో కంటెంట్ ఉంటే సినిమా లెంగ్త్ గురించి ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోరు.ఈ క్రమంలో అన్నాత్తే అదే పెద్దన్న సినిమా విషయంలో కూడా సినిమా లెంగ్త్ విషయంలో చిత్రయూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో రజినికి జోడీగా నయనతార నటిస్తుంది.సినిమాలో మహానటి కీర్తి సురేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది.

ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఈ మూవీ తెలుగులో కూడా భారీ బిజినెస్ చేసిందని తెలుస్తుంది.రజిని సినిమా అంటే తెలుగులో కూడా ఆడియెన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తుంటారు.

పెద్దన్న విషయంలో రజిని ఫ్యాన్స్ అంచనాలు నిజమవుతాయో లేదో చూడాలి.

న‌ల‌భైల్లో పిల్ల‌ల‌ను ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి!