రజినీకాంత్ జైలర్ విడుదల… కార్యాలయాలకు సెలవు ప్రకటించిన యాజమాన్యం?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) తాజాగా నటించిన చిత్రం జైలర్( Jailer ) .

ఈ సినిమా ఆగస్టు 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

నెల్సన్ దిలీప్ కుమార్ ( Nelson Dileep Kumar ) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

ఇలా ఈ సినిమా ఆగస్టు 10వ తేదీ విడుదల కానున్నటువంటి నేపథ్యంలో చెన్నై బెంగళూరు వంటి నగరాలలో పలు కంపెనీలు తమ కార్యాలయాలకు సెలవులను ప్రకటించారు.

"""/" / ఈ విధంగా ఈ సినిమా విడుదలైన మొదటి రోజే సినిమాని చూసే విధంగా తమ కంపెనీలకు సెలవు ప్రకటించడం గమనార్హం.

అయితే మరికొన్ని కంపెనీలు ఏకంగా తమ ఉద్యోగులకు టికెట్లను కూడా అందజేస్తూ సినిమా చూసేందుకు ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది.

గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానటువంటి ఈ సినిమా కోసం సూపర్ స్టార్ అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ కూడా ప్రారంభం కావడంతో హాట్ కేకుల్లా టికెట్స్ సేల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే సినిమాపై కూడా అంచనాలు భారీగానే పెరిగిపోతున్నాయి. """/" / ఇక ఈ సినిమాలో రజనీకాంత్ రమ్యకృష్ణ( Ramya Krishna ) జంటగా కనిపించబోతున్నారని సమాచారం.

అయితే ఈ సినిమాలో రజనీకాంత్ ప్రేమ కథ చిత్రంలో కాకుండా తన వయసుకు తగ్గ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమాలో తమన్నా కూడా కొన్ని కీలక సన్నివేశాలలో సందడి చేయబోతున్నారు.

ఇక తమన్నా నటించిన కావాలయ్యా అనే పాట ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో మనకు తెలిసిందే.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాట ట్రెండింగ్ లో ఉండడమే కాకుండా ఎంతో మంది ఈ పాటకు రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.

మరి ఆగస్టు 10వ తేదీ విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్సా ? ఆయనే ఎందుకంటే ?