జైలర్ ఎఫెక్ట్‌.. ఆ సినిమాకి తెలుగులో మార్కెట్‌ డబుల్‌!

సూపర్ స్టార్ రజినీకాంత్‌( Rajinikanth )జైలర్ సినిమా తో ఏకంగా రూ.500 కోట్ల వసూళ్లను దక్కించుకున్నాడు.

రికార్డ్‌ స్థాయి వసూళ్లు సొంతం చేసుకున్న రజినీకాంత్ తదుపరి సినిమాను జ్ఞానవేల్‌ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమాకు సంబంధించిన విషయాలు మరియు ఆ సినిమా పోస్టర్స్ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

రోబో సినిమా తర్వాత రజినీకాంత్‌ నటించిన ఏ ఒక్క సినిమా కూడా తెలుగు లో సరిగ్గా ఆడలేదు.

దాంతో జైలర్‌ ( Jailar Movie )వరకు కూడా అన్ని సినిమా లకు మార్కెట్‌ డౌన్ అవుతూ వచ్చింది.

"""/" / జైలర్‌ సినిమా ( Jailar Movie )ను మొదట చాలా మంది నిర్మాతలు తిరస్కరించారు.

అయినా కూడా తమిళ్‌ నిర్మాతలు పట్టుబట్టి విడుదల చేశారు.తక్కువ రేటుకు బయ్యర్లు కొనుగోలు చేసి మంచి లాభాలను సొంతం చేసుకున్నారు.

జైలర్‌( Jailar Movie ) మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో రజనీకాంత్‌ 170వ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అందుకే ఆ సినిమా ని దాదాపు రెట్టింపు రేటుకు కొనుగోలు చేసేందుకు గాను బయ్యర్లు సిద్ధం అయ్యారు.

జైలర్‌ సినిమా ను కొనుగోలు చేసిన వారే ఇప్పుడు ఈ సినిమా ను కూడా పెద్ద మొత్తం లో కొనుగోలు చేసేందుకు గాను సిద్ధంగా ఉన్నారట.

తెలుగు లో రజనీకాంత్ సినిమా కు చాలా సంవత్సరాల తర్వాత ఈ రేంజ్ మార్కెట్ ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

"""/" / ముందు ముందు కూడా రజినీకాంత్>( Rajinikanth ) సినిమాలకు మంచి బిజినెస్ ఉంటుందేమో చూడాలి.

ప్రస్తుతం చేస్తున్న సినిమా లను తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆధరిస్తారు అనేదాన్ని బట్టి తదుపరి సినిమాల యొక్క మార్కెట్‌ ఉంటుంది అంటు మీడియా సర్కిల్స్ వారు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రజనీ కాంత్ త్వరలోనే లాల్ సలామ్( Lal Salaam ) అనే సినిమా తో కూడా రాబోతున్నాడు.

ఆ సినిమా కి కూడా తెలుగు లో మంచి మార్కెట్ ఉండే అవకాశాలు ఉన్నాయి.

రక్తహీనత ఉన్నవారు నిమ్మరసం తీసుకోకూడదా.. అసలు నిజం ఏంటి?