తలైవా 170 గురించి కీలక అప్డేట్ ఇచ్చిన రజనీకాంత్.. సినిమా అలా ఉండబోతుందా?
TeluguStop.com
సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) ప్రస్తుతం ఏడుపదుల వయసులో ఉన్నప్పటికీ ఈయన మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా( Jailer ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.దాదాపు 700 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఈ సినిమా తర్వాత రజనీకాంత్ తన తదుపరి సినిమా లాల్ సలామ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమాకు స్వయంగా రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. """/" /
ఇకపోతే రజనీకాంత్ తన 170వ సినిమాను ఇదివరకే ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.
సూర్య హీరోగా నటించిన జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ ( TJ Gnanavel ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.
ఇక ఈ సినిమాలో టాలీవుడ్ హీరో రానా( Hero Rana Daggubati ) కూడా బాగా పోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇదిలా ఉండగా తాజాగా రజనీకాంత్ ఈ సినిమా గురించి కీలక అప్డేట్స్ విడుదల చేశారు.
"""/" /
రజనీకాంత్ తన 170 వ సినిమా( Rajinikanth 170 ) గురించి మాట్లాడుతూ నేను జ్ఞానవేల్ దర్శకత్వంలో చేయబోయే ఈ సినిమా సామాజిక సందేశం తో కూడిన భారీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు.
అయితే ఇప్పటికీ ఇంకా ఈ సినిమాకు ఏ విధమైనటువంటి టైటిల్ నిర్ణయించలేదు మరొక రెండు రోజులలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కాబోతుందని ఈయన తెలిపారు.
ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి రాబోతుందని రజనీకాంత్ తెలియజేశారు.ఇలా రజనీకాంత్ ఈ సినిమా గురించి ఇచ్చిన అప్డేట్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేసిందని చెప్పాలి.
ఇలా సామాజిక సందేశంతో కూడిన చిత్రాలు చేయడంలో దర్శకుడు జ్ఞానవేల్ దిట్ట అనే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాల్సి ఉంది.