‘తలైవర్ 170’లో అమితాబ్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన సూపర్ స్టార్!

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ దగ్గర బిగ్గెస్ట్ హీరోల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఒకరైతే.

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఒకరు.ఈ ఇద్దరు కూడా దిగ్గజ నటులుగా తమ సత్తా చాటారు.

కొన్ని దశాబ్దాలుగా తమకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుని ఇప్పటికి సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు.

మరి అలాంటి ఇద్దరు సూపర్ స్టార్స్ చాలా రోజుల తర్వాత ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారు.

రజినీకాంత్ నెక్స్ట్ సినిమాలో అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.దీంతో ఈ సంతోష సమయాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

రజినీకాంత్ షేర్ చేసుకున్న ఈ పిక్ ఇప్పుడు వైరల్ అయ్యింది. """/" / తాను బిగ్ బి తో దాదాపు 33 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిసి నటిస్తున్నాను అని ఇన్నేళ్ల తర్వాత నా మెంటర్ శ్రీ అమితాబ్ బచ్చన్ తో నా 170వ సినిమాలో(Thalaivar170) స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని నా మనసు ఉప్పొంగిపోతుంది అని చెబుతూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయ్యింది.

"""/" / కొన్నేళ్లుగా ఫామ్ కోల్పియిన సూపర్ స్టార్ కు జైలర్( Jailer Movie ) వంటి హిట్ దొరికింది.

ఈ సినిమాతో సంచలనాలు క్రియేట్ చేసాడు.ఇక ఈ సినిమా తర్వాత రజినీకాంత్ డైరెక్టర్ టి జి జ్ఞ్యానవేల్ (T.

J Gnanavel) దర్శకత్వంలో తన 170వ సినిమాను చేస్తున్నాడు.షూట్ ఇప్పటికే స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తో పాటు రానా దగ్గుబాటి( Rana Daggubati ) కూడా భాగం అయ్యాడు.

కాగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న.ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ఫిక్స్ అయ్యాడు.

తండేల్ ఒక్క పాట కోసం 900 డాన్సర్.. మూడు కోట్ల ఖర్చు.. సాహసం చేస్తున్న ప్రొడ్యూసర్!