Rajinikanth : సీఎం కి భయపడి ఆ సినిమా చేయకుండా పారిపోయిన రజినీకాంత్.. ఎందుకంటే..?
TeluguStop.com
రజనీకాంత్ ( Rajinikanth ) ఏంటి.సీఎం కి భయపడి సినిమా చేయకుండా పారిపోవడం ఏంటి.
అని ఈ విషయం తెలిసి మీరందరూ ఆశ్చర్యపోతున్నారు కదూ.అయితే అది నిజమేనండి.
మీరు వినేది వింటున్నది నిజమే.ఎందుకంటే ఆ సినిమా చేయమంటే రజనీకాంత్ తమిళనాడు సీఎం కి భయపడి నేను చేయను బాబోయ్ అని చేతులెత్తేసారట.
ఆ సినిమా ఏంటి.అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శంకర్ ( Shankar ) దర్శకత్వంలో ఇప్పటికే ఎన్నో భారీ ప్రాజెక్టులు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
రోబో( Robo ), రోబో 2.0, జీన్స్, ప్రేమికుడు,అపరిచితుడు, ఐ, ఒకే ఒక్కడు వంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలో వచ్చాయి.
అయితే ఈ సినిమాలన్నింటిలోకెల్లా ఒకే ఒక్కడు ( Oke Okkadu ) సినిమా చాలా స్పెషల్.
ఎందుకంటే ఈ సినిమా తీసేటప్పుడు ఎన్నో వివాదాలు వచ్చాయట. """/" /
మరీ ముఖ్యంగా ఈ సినిమా తమిళనాడు సీఎం ( Tamilanadu Cm ) కి వ్యతిరేకంగా రావడంతో చాలామంది భయపడ్డారు.
కానీ శంకర్ మాత్రం చాలా ధైర్యంగా ఈ సినిమా తెరకెక్కించారు.ఈ కథ అమెరికన్ టీవీ రిపోర్టర్ అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ కి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ ఆధారంగా రాసుకున్నారు.
అయితే ఈ సినిమాలో ఒక రోజు ముఖ్యమంత్రి అయితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి.
"""/" / ఎలాంటి అధికారాలు ఉంటాయి అనే విషయాన్ని బేస్ చేసుకుని కథ రాసుకొని అన్ని విషయాలు హైకోర్టు జడ్జిని కలిసి తెలుసుకున్నారట శంకర్.
అయితే ఈ సినిమా కథ ముందుగా రజినీకాంత్ తో తీయాలి అని శంకర్ భావించారట.
కానీ ఈ స్టోరీ చెప్పడంతోనే రజినీకాంత్ ( Rajinikanth ) ఈ కథ కాస్త తమిళనాడు సీఎం కి ఆపోజిట్ గా ఉన్నట్లు అనిపిస్తోంది.
ఈ సినిమాలో చేస్తే నాకు తర్వాత ఎన్ని అవాంతరాలు వస్తాయో నేను చేయను బాబోయ్ అని ఈ మూవీ రిజెక్ట్ చేశారట.
ఆ తర్వాత విజయ్,కమల్ హాసన్, టాలీవుడ్ హీరో వెంకటేష్ వంటి వాళ్లకి చెప్పిన కూడా ఫలితం లేకపోవడంతో చివరికి అర్జున్ తో ఈ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు శంకర్( Shankar).
ఈ సినిమాలో పాటలు,కాన్సెప్ట్ చాలా బాగుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టడంతో అప్పట్లోనే ఈ సినిమా 60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయ్యింది.
న్యూయార్క్లో దారుణం .. రైలులో మహిళకు నిప్పు , తగలబడిపోతుంటే ఆనందించిన సైకో