బస్సు డ్రైవర్ కు సూపర్ స్టార్ 'దాదా సాహెబ్‌పాల్కె' అవార్డ్ అంకితం
TeluguStop.com
సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఇండియన్ సినీ ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురష్కారం దాదా సాహెబ్ పాల్కె అవార్డు దక్కింది.
నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా ఇండస్ట్రీకి రజినీకాంత్ చేస్తున్న సేవలకు గుర్తుగా జాతీయ ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది.
కొన్ని నెలల క్రితం ఈ అవార్డును ప్రకటించినా కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు.
తాజాగా ఢిల్లీలో ఈ వేడుక జరిగింది.భారత ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు ఈ అవార్డును రజినీకాంత్ కు అందించడం జరిగింది.
రజినీకాంత్ తనకు దక్కిన ఈ అత్యున్నత పురష్కారంను తన మిత్రుడు, గురువు మరియు కుటుంబ సభ్యులకు అంకితం ఇవ్వడం జరిగింది.
రజినీకాంత్ బస్సు కండక్టర్ గా పని చేస్తున్న సమయంలో ఆ బస్సు డ్రైవర్ రజినీకాంత్ లోని ప్రతిభను గుర్తించాడు.
ఆ సమయంలోనే రజినీకాంత్ ను నటన వైపు ఆసక్తి కలిగించేలా వ్యాఖ్యలు చేయడం జరిగింది.
బస్సు డ్రైవర్ అయిన రాజ్ బహుదూర్ ప్రోత్సహం వల్లే తాను హీరోను అయ్యాను.
కనుక ఆయనకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నట్లుగా రజనీ కాంత్ ప్రకటించాడు.రజినీకాంత్ తన గురువుగా చెప్పుకునే బాల చందర్ కు కూడా ఈ అవార్డును ఇవ్వడం జరిగింది.
ఇక తన అన్నయ్య అయిన సత్యనారాయణ గైక్వాడ్ కు ఈ అవార్డును ఇవ్వడం జరిగింది.
తమిళ సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ అభిమానులను దక్కించుకున్న రజినీకాంత్ విదేశీ అభిమానులను దక్కించుకున్న మొదటి సౌత్ స్టార్ గా కూడా రికార్డ్ సాధించాడు.
అద్బుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమా ను చేస్తున్నాడు.
దీపావళి కానుకగా ఆ సినిమా ను విడుదల చేయబోతున్నారు.సినిమా ఇండస్ట్రీలో ఇంకా సుదీర్ఘ కాలం పాటు కొన సాగే ఉద్దేశ్యం తో రజినీకాంత్ ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
ఈ అవార్డు ఆయన కెరీర్ కు మరింత ఊపు తీసుకు వస్తాయని అంటున్నారు.
రజినీకాంత్ రియల్ సూపర్ స్టార్ అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ లో ఆ ఒక్క పాట చూస్తే చాలు టికెట్ డబ్బులు వెనక్కి వచ్చినట్టే: ఎస్ జె సూర్య