సినిమా ఒక్కటే.. ఫలితాలు అక్కడ ఇక్కడ రెండు విధాలు

సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా నటించిన తమిళ సినిమా అన్నాత్తే దీపావళి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా లో రజినీకాంత్‌ నటించడం వల్ల అంచనాలు భారీగా ఉండటంతో పాటు శివ దర్శకత్వం వహించడం వల్ల మాస్ ప్రేక్షకులు భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు.

ఇక నయనతార మరియు కీర్తి సురేష్ వంటి స్టార్స్ హీరోయిన్స్ ఇంకా ఖుష్బు మరియు మీనా వంటి సీనియర్‌ హీరోయిన్స్ కూడా ఈ సినిమా లో నటించడం వల్ల తమిళనాట అన్నాత్తే పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరిగాయి.

అన్నాత్తే సినిమాను చూడ్డం కోసం ఆఫీస్ లు సెలవులు ఇవ్వడంతో పాటు చాలా చాలా హడావుడి జరిగింది.

అక్కడ మొదటి రోజు దాదాపుగా 31 కోట్ల వసూళ్లు నమోదు అయ్యి రికార్డు సృష్టించింది.

ఆ తర్వాత కూడా మంచి వసూళ్లు నమోదు అవుతూ ఉన్నాయి.మొదటి మూడు రోజుల్లో దాదాపుగా 60 నుండి 65 కోట్ల వరకు నమోదు అవ్వడం ఖాయం అనుకున్నారు.

అనుకున్నట్లుగానే సినిమా భారీ వసూళ్లు సాధించింది.ఇది అంతా కూడా నాణెంకు ఒక్క వైపు మాత్రమే.

అదే నాణెం అంటే అదే అన్నాత్తే సినిమా తెలుగులో పెద్దన్నగా విడుదల అయ్యి బయ్యర్లకు రక్త కన్నీరు మిగిల్చింది.

బాబోయ్‌ ఇదేం రచ్చ రంబోలా అన్నట్లుగా అభిమానులు గుండెలు బాదుకుంటున్నారు.తెలుగు లో ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది.

పెద్ద ఎత్తున నష్టాలు తప్పడం లేదు. """/"/ తెలుగు డబ్బింగ్‌ రైట్స్ ను 15 కోట్లకు కొనుగోలు చేసిన నిర్మాతలకు అయిదు కోట్లు కూడా వెనక్కు వచ్చే పరిస్థితి లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో హడావుడి ఏమీ లేదు.ఇక తమిళంలో మాత్రం మొదటి వారం రోజులు అన్నాత్తే తో మారు మ్రోగి పోవడం ఖాయం అన్నట్లుగా ఉంది.

లాంగ్‌ రన్ లో అన్నాత్తే సినిమా కేవలం తమిళనాడులోనే వంద కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది.

అన్నాత్తే యూఎస్‌ లో కూడా బాగా రాబడుతోంది.మొత్తంగా ఒకే సినిమా ఒకే సారి విడుదల అయ్యి అక్కడ హిట్టు.

ఇక్కడ ఫట్టు అన్నట్లుగా ఫలితాన్ని చవిచూసింది.

కళ్యాణ్ రామ్ ను ట్రోల్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అసలేం జరిగిందంటే?