Rajinikanth: రజినీకాంత్ హీరో ఏంటి అంటూ అతడి ముందే అవహేళన
TeluguStop.com
తన జీవితంలో జరిగిన అనేక విషయాలను ఎలాంటి మొహమాటం లేకుండా ప్రజలతో మీడియా ముఖంగా పంచుకోవడానికి సంకోచించని హీరో గా రజినీకాంత్ కి( Rajinikanth ) పేరుంది.
ఇంతకు ముందు కొన్ని ఇంటర్వూస్ లో తన చెడు అలవాట్ల గురించి పంచుకున్న రజిని తాజాగా ఐశ్వర్య రాయ్( Aishwarya Rai ) వల్ల తనకు దక్కిన గౌరవం గురించి కూడా పంచుకున్నాడు.
ఇలా సాధారణంగా ఏ హీరో కూడా హీరోయిన్ గొప్పతనం గురించి మాట్లాడానికి ఒప్పుకోడు.
కానీ రజిని కి అలంటి భయం, బెరుకు ఏమి ఉండవు.అందుకు ఉన్నది ఉన్నట్టుగా మనసులో ఎలాంటి మొహమాటం లేకుండా పంచుకుంటారు.
ఇప్పుడు మన చెప్పుకోబోతున్న సంఘటన రోబో సినిమా( Robo Movie ) గురించి.
ఒకసారి రజినీకాంత్ బెంగుళూర్ లో ఉన్న తన అన్న ఇంటికి వెళ్లగా అక్కడ పక్కనే ఉన్న రాజస్థానీ టెంనెంట్ కూడా రజినీని కలిసాడు.
60 ఏళ్లకు పైగా ఉన్న ఆ వ్యక్తి రజిని ని కలవడం కోసం వచ్చాడు.
అతడి పేరు నందూలాల్.రజిని మరియు నందు లాల్ మధ్య ఒక ఫన్నీ సంఘటన జరిగింది.
నందూలాల్ వచ్చి రాగానే రజిని సర్ ఏంటి మీ జుట్టు మొత్తం పోయింది అని అన్నాడట.
రజిని నవ్వుతు అంత పోయింది సర్ అని చెప్పాడట. """/" /
మీరు మీ రిటైర్మెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారా అని ప్రశ్నించగా రజిని అందుకు బదులుగా లేదు సర్ నేను ఇంకా సినిమాలు తీస్తున్నాను అని చెప్పాడట.
ఏం సినిమా చేస్తున్నారు అని అడిగితే రోబో అనే చిత్రం చేస్తున్నాను అందులో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ చేస్తుంది అంటూ రజిని చెప్పారట.
బాగా ఎక్సయిట్ అయిపోయిన నందూలాల్ ఐశ్వర్య చాల అందమైన హీరోయిన్ మరి ఆమె పక్కన హీరో ఎవరు సర్ అని అడిగారట.
"""/" /
దానికి నేనే సర్ హీరో అంటూ రజిని చెప్పడం తో షాక్ అయినా నందు లాల్ మీరే హీరోనా అని ఆశ్చర్యపోయాడట.
పక్కనే ఉన్న అయన పిల్లలు నాన్నా మీరు ఊరుకోండి అయన హీరో అంటూ చెపుతున్నారట.
ఆ తర్వాత షాక్ తో పది నిముషాలు సైలెంట్ గా ఉన్నాడట నందూలాల్.
ఇక బై చెప్పి ఇంటికి వెళ్ళిపోతూ బయట తన పిల్లలతో నందులాల్ ఐశ్వర్య రాయ్ కి ఏమైంది ఎందుకు ఇతడితో నటిస్తుంది బచ్చన్ ఫ్యామిలీ ఎందుకు ఒప్పుకుంది అంటూ నసుగుతూ ఉన్నాడట.
పుష్పరాజ్ బాటలోనే ఎన్టీఆర్ దేవర2.. ఆ రేంజ్ కలెక్షన్లు సాధించడం ఖాయం!