సూపర్‌ స్టార్‌ మూవీ ఏడాది కాలం ఆలస్యం నిజమా?

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ అన్నాత్తే సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అన్నాత్తే సినిమా చిత్రీకరణ సమయంలోనే రజినీకాంత్‌ తీవ్ర అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొన్నాడు.దాంతో ఆయన ఏకంగా రాజకీయాలకు వెళ్లాలనుకుని కూడా క్యాన్సిల్‌ అయ్యాడు.

రాజకీయాలను వదులుకున్న ఆయన సినిమాలను కూడా వదిలేస్తాడేమో అంటు వార్తలు వచ్చాయి.గత ఏడాదిలోనే అమెరికాకు రజినీకాంత్‌ వెళ్లాల్సి ఉంది.

కాని కరోనా వల్ల ఆయన అమెరికాకు వెళ్లలేదు.కాని అతి త్వరలోనే రజినీకాంత్‌ అమెరికాకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నాడు.

ఈ సమయంలో కొందరు అన్నాత్తే సినిమా గురించిన చర్చ జరుగుతోంది.అన్నాత్తే సినిమా కంటే ఆయన హెల్త్‌ ముఖ్యం.

అందుకే సినిమా ను క్యాన్సిల్‌ చేసుకుని అమెరికాకు వెళ్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం రజినీకాంత్ అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

మరో వైపు తమిళ మీడియాలో అన్నాత్తే సినిమా గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అన్నాత్తేను మద్యలో వదిలేసి అమెరికా వెళ్లబోతున్నాడు అంటూ కొందర ఆయన మళ్లీ వచ్చేంత వరకు అంటే 2022 వరకు ఆయన అన్నాత్తే సినిమా రాకపోవచ్చు అంటున్నారు.

అన్నాత్తే సినిమా షూటింగ్‌ ను పూర్తి చేయలేదు అంటూ కొందరు అంటూ ఉంటే యూనిట్‌ సభ్యులు మాత్రం ఆయన తన పోర్షన్‌ ను పూర్తి చేశాడని చిత్రీకరణ ముగిసిన తర్వాతే అన్నాత్తే విడుదలకు అంతా ఓకే అన్నుకున్న తర్వాతే అమెరికా వెళ్తున్నాడు అంటున్నారు.

"""/"/ సెకండ్‌ వేవ్‌ ప్రారంభం అయ్యి కర్ఫ్యూ సమయంలో కూడా ప్రత్యేక అనుమతులు తీసుకుని హైదరాబాద్‌ లో షూటింగ్‌ ను రజినీకాంత్ నిర్వహించాడు.

అందుకే సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యిందని విడుదలకు ఎలాంటి అడ్డు లేదని వచ్చే దసరా లేదా దీపావళికి సినిమా విడుదల ఖాయం అంటున్నారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ను ఆ హీరోతో చేయాల్సిందా..?