రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ప్రగాఢ సానుభూతి..
TeluguStop.com
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్( Rajendra Prasad ) ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి గుండపోటు కారణంతో మృతి చెందారు.ఆమె మృతి పై ప్రముఖుల అందరూ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
కార్డియాక్ ఎటాక్ అవ్వడంతో గాయత్రి గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రికి( Gayathri To Gachibowli AIG Hospital ) తరలించారు కుటుంబ సభ్యులు.
చికిత్స పొందుతూ గాయత్రి మృతి చెందినట్లు డాక్టర్లు తెలియజేశారు.రాజేంద్రప్రసాద్ కు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.
కూతురు గాయత్రి అకస్మాత్తు మృతితో రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులు అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.
"""/" /
హైదరాబాద్ కూకట్ పల్లిలో గాయత్రి గాయత్రి భౌతికకాయానికి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించడంతో సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శిస్తున్నారు.
ఈ క్రమంలో కొంత మంది సినీ తారలు సోషల్ మీడియా ద్వారా రాజేంద్రప్రసాద్ కుటుంబానికి సానుభూతి తెలియచేస్తూ ఉన్నారు.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ “నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి( Gayatri ) గారి మరణం చాలా విషాదకరం.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.రాజేంద్ర ప్రసాద్ గారికి, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అంటూ రాసుకొని వచ్చారు.
"""/" /
ఐకమరోవైపు రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి మరణం పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.
ప్రముఖ నటులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ కుమార్తె శ్రీమతి గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది.
శ్రీమతి గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యాన్ని శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానని తెలియజేశారు.
రాజేంద్రప్రసాద్ కూతురు మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.
తల్లీ కూతురుతో రొమాన్స్ చేసిన సీనియర్ ఎన్టీఆర్.. ఈ రికార్డ్ ఈ స్టార్ హీరోకే సొంతం!