రాజేంద్రప్రసాద్ సేనాపతి ట్రైలర్ టాక్.. ఆహా ఒరిజినల్ ఫిల్మ్ అదిరింది..!

ఓటీటీల వల్ల నటీనటులు ఎప్పుడూ బిజీగా ఉంటున్నారు.సీనియర్స్ జూనియర్స్ అనే తేడా లేకుండా అందరు మంచి ఛాన్సులు అందుకుంటున్నారు.

ఈ క్రమంలో సీనియర్ స్టార్స్ కూడా ఓటీటీల వల్ల మంచి అవకాశాలు అందుకుంటున్నారు.

ప్రస్తుతం అలాంటి ఓ ఛాన్స్ కొట్టేశారు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్.ఓ పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే మరో పక్క ఓటీటీ సినిమాల్లో నటిస్తున్నారు.

ఆహా ఒరిజినల్స్ లో రాజేంద్రప్రసాద్ లీడ్ రో లో వస్తున్న సినిమా సేనాపతి.

చిరంజీవి తనయురాలు సుస్మిత నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.పోలీస్ దగ్గర నుండి గన్ కొట్టేసి.

బ్యాంక్ లో డబ్బు కొట్టేసి ఆ డబ్బులను బయటకొచ్చి రోడ్డు మీద విసిరేస్తాడు.

ఇంతకీ అసలీ సేనాపతి ఎవరు.ఎందుకిలా చేస్తున్నాడు అన్నది తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

రాజేంద్ర ప్రసాద్ సేనాపతి పాత్రలో అదరగొట్టేశారని అనిపిస్తుంది.ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.

ఆహాలో డిసెంబర్ 31న ఇది స్ట్రీమింగ్ అవుతుంది.అభిరుచి గల తెలుగు ప్రేక్షకులకు కొత్త కొత్త సినిమాలతో ఆహా అలరించేందుకు వస్తుంది.

కొత్తగా సేనాపతి తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా ఉంటుందని అనిపిస్తుంది.ఈ సినిమాను పవన్ సాధినేని డైరెక్ట్ చేశారు.

ఈ ముగ్గురు దర్శకుల సినిమాలు అందుకే ప్రత్యేకంగా నిలుస్తున్నాయా..?