మా నాన్న గురించి అలాంటి వార్తలు ప్రచారం చేశారు.. రాజీవ్ కనకాల కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల( Rajeev Kanakala ) ఈ మధ్య కాలంలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

రాజీవ్ కనకాల సినిమాలలో చనిపోయే పాత్రల్లో ఎక్కువగా నటించారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లు మన కుటుంబ సభ్యులపై అలాంటి కామెంట్లు చేస్తే ఆ బాధ తెలుస్తుందని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.

ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసేవాళ్లు సైతం ట్రోల్స్ వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

నేను ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చానని "మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడని" థంబ్ నెయిల్ పెట్టారని ఆయన తెలిపారు.

ఒకనొక సమయంలో నాన్నకు( Rajeev Kanakala Father ) సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని నేను చెబితే 1994లో ఆ ఘటన జరిగిందని చెబితే "సూసైడ్ చేసుకున్న దేవదాస్ కనకాల"( Devadas Kanakala ) అని థంబ్ పెట్టారని రాజీవ్ కనకాల తెలిపారు.

"""/" / ఆ తర్వాత థంబ్ నెయిల్ ను మార్పించానని ఆయన వెల్లడించారు.

థంబ్ నెయిల్స్ చూసి ఆ వార్త నిజమని చాలామంది నమ్ముతున్నారని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.

కొంతమంది అయితే బ్రతికున్న సెలబ్రిటీలను చంపేశారని ఆయన వెల్లడించారు.ఒక వ్యక్తి చనిపోయారని పింఛన్ ఆపేశామని ఆ వ్యక్తి ఇబ్బంది పడ్డాడని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.

"""/" / జూనియర్ ఎన్టీఆర్,( Jr NTR ) రాజీవ్ కనకాల మధ్య మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

తన సినిమాలో మంచి రోల్ ఉంటే రాజీవ్ కనకాలకు ఛాన్స్ ఇవ్వడానికి ఎన్టీఆర్ వెనుకాడరనే సంగతి తెలిసిందే.

రాజీవ్ కనకాల రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉంది.రాజీవ్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

రాజీవ్ కనకాల యాక్టింగ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

భోజనం మధ్యలో లేపి దూరంగా కూర్చోవాలని చెప్పారు.. పా రంజిత్ సంచలన వ్యాఖ్యలు!