మూడు నెలలు డిప్రెషన్.. నోట మాట రాలేదు రాజీవ్ కనకాల ఎమోషనల్ కామెంట్స్!

తెలుగు సినిమాలలో నటుడిగా పలు కీలక పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రాజీవ్ కనకాల( Rajeev Kanakala ) ఒకరు.

ఈయన నటించే సినిమాలలో పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ సినిమాకి మొత్తం ఈయన పాత్ర కీలకంగా ఉంటుంది.

అలాంటి పాత్రలలో నటిస్తూ మెప్పిస్తూ ఉంటారు.ఇలా పలు సినిమాలలో బిజీగా ఉన్న రాజీవ్ కనకాల తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాజీవ్ కనకాల తన చెల్లెలు శ్రీలక్ష్మి( Sree Lakshmi ) చివరి క్షణాలలో అనుభవించిన బాధ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

"""/" / రాజీవ్ కనకాల సోదరి శ్రీ లక్ష్మీ పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ సందర్భంగా ఈయన ఆమె గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తాను అమ్మ నాన్న చెల్లి అందరిని కోల్పోయానని తెలిపారు.

తన చెల్లెలు శ్రీలక్ష్మి క్యాన్సర్ ( Cancer ) బారిన పడి మరణించారు.

ఆమెకు క్యాన్సర్ ఉన్న విషయం తెలియగానే ట్రీట్మెంట్ ఇప్పించాము.దాదాపు క్యాన్సర్ నుంచి బయటపడింది.

తనకోసం ఎన్నో పూజలు హోమాలు కూడా చేయించాము ఇక అంతా బాగుంది అనుకున్న సమయంలో తనకు కామెర్లు వచ్చాయి.

అదే సమయంలో లాక్ డౌన్ కూడా పడింది. """/" / అలా తన పరిస్థితి రోజురోజుకు దిగజారిపోయింది.

తన బావ ఫోన్ చేసి పరిస్థితి వివరించడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే చోటే ఉన్నాము.

తనని ఏదైనా హాస్పిటల్ కి చేర్చాలి అన్న కూడా తనకు గ్యారెంటీ ఇవ్వలేదు.

ఇలా మూడు నెలల పాటు తన చెల్లెలు నరకం అనుభవించిందని తెలిపారు.నోట నుంచి మాటరాదు అందరి వైపు చూస్తూ కన్నీళ్లు మాత్రమే కార్చేది.

నిద్రపోతున్న సమయంలో తాను బాధపడుతూ మూలుగుతూ ఉంటే తాను ఇంకా బ్రతికే ఉందని అనుకునే వాళ్ళం.

ఇలా మూడు రోజుల పాటు బెడ్ పై తన చెల్లెలు అలా చూసేసరికి తట్టుకోలేకపోయాము అంటూ ఈ సందర్భంగా రాజీవ్ కనకాల తన చెల్లెలు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

తాను మరణించిన తర్వాత సుమ( Suma ) మనకు ఇప్పుడు నలుగురు పిల్లలని భావించి ఆ ఇద్దరు పిల్లల బాధ్యత కూడా తానే చూసుకుంటుందని ఇప్పటికి సుమ వారి అవసరాలన్నింటినీ తీరుస్తూ తల్లి లేని లోటును వారికి తెలియకుండా పెంచుతుందని రాజీవ్ కనకాల ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

బాలయ్యకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చి ఎన్టీఆర్ కు డిజాస్టర్లు ఇచ్చిన దర్శకుడు ఎవరో తెలుసా?