సుమతో విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజీవ్.. వాళ్లు ఇబ్బంది పడ్డారంటూ?

టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీలో ప్రేమించి, పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న జోడీలలో సుమ రాజీవ్ కనకాల( Suma Rajeev Kanakala ) జోడీ ఒకటి.

ఈ జంట సంతోషంగా జీవనం సాగిస్తుండగా సుమ వరుసగా టీవీ షోలతో బిజీగా ఉంటే రాజీవ్ కనకాల చేతినిండా సినిమా ఆఫర్లు ఉన్నాయి.

సుమ, రాజీవ్ కనకాల పారితోషికాలు కూడా భారీ రేంజ్ లో ఉన్నాయి.అయితే సుమ, రాజీవ్ విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలపై తాజాగా మరోమారు రాజీవ్ కనకాల స్పందించి వివరణ ఇచ్చారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/07/rajeev-kanakala-comments-about-orce-with-suma-details-here-goes-virala!--jpg" / విడాకులకు సంబంధించి ప్రచారంలోకి వచ్చిన వార్తల వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారని రాజీవ్ కనకాల అన్నారు.

తమ విడాకుల గురించి ప్రచారం జరగడం కొత్త కాదని ఈ ప్రచారం చాలా రోజుల నుంచి సాగుతోందని ఆయన అన్నారు.

మేము విడాకులు తీసుకోవడం లేదని ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేసినా ఆ వార్తలను నమ్మడం లేదని రాజీవ్ కనకాల తెలిపారు.

అమ్మానాన్న జీవించి ఉంటే ఇలాంటి ఫేక్ వార్తలు వాళ్లను సైతం బాధ పెట్టేవని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/07/rajeev-kanakala-comments-about-orce-with-suma-details-here-goes-viralc!--jpg" / విడాకులకు సంబంధించి వార్తలు ప్రచారంలోకి వస్తే ఆ వార్తలకు సుమ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదని రాజీవ్ కనకాల వెల్లడించారు.

తనను మాత్రం అలాంటి వార్తలు హర్ట్ చేస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.విడాకుల గురించి స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా అదే తరహా వార్తలను ప్రచారం చేయడం కరెక్ట్ కాదని రాజీవ్ కనకాల కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

రాజీవ్ కనకాల నుంచి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఇకనైనా ఈ వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.

స్టార్ డైరెక్టర్ రాజమౌళి వల్ల రాజీవ్ కనకాల కెరీర్ కు మేలు జరిగింది.

సుమ, రాజీవ్ కెరీర్ పరంగా మరింత బిజీ కావడంతో పాటు మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వాళ్ల టైప్ లో సాయిపల్లవి సింపుల్ గా ఉంటుంది.. చందూ మొండేటి క్రేజీ కామెంట్స్ వైరల్!