వైరల్: దారుణం… కవల పిల్లలను హతమార్చి, ఆత్మహత్య చేసుకున్న తల్లి?

ఈ ప్రపంచంలో తల్లిని మించిన అనురాగ మూర్తి లేదని అంటారు.ఎందుకంటే తల్లి తండ్రి కంటే కూడా ఎక్కువతా తన బిడ్డల విషయంలో జాగ్రత్త వహిస్తుంది.

అంతులేని ప్రేమను పంచుతుంది.మరి అలాంటి తల్లి తన కన్న బిడ్డలను చంపుకుంది అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇక్కడ నమ్మి తీరాల్సిందే.

ఓ కసాయి తల్లి తాను జన్మనిచ్చిన కవల పిల్లలను( Twins ) హతమార్చి, మరీ తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇపుడు జనాలకు చాలా దారుణమైన చర్యగా కనబడుతోంది.

అవును, రాజస్థాన్‌లో( Rajasthan ) ఓ మహిళ కన్న పేగుబంధాన్ని కూడా మరచి తన రెండున్నరేళ్ల కవల కొడుకులను చేతులారా విషం ఇచ్చి అంతం చేసింది.

ఆ తర్వాత తానూ విషం( Poison ) తీసుకొని మృతి చెందింది.ఈ విషాద ఘటన సిరోహి జిల్లాలోని శివగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

"""/" / వివరాల్లోకి వెళితే.శివగంజ్ ప్రాంతంలో నివసిస్తున్న తల్లికి తన కవల కొడుకులు అంటే అస్సలు ఇష్టం లేదు.

ఈ క్రమంలో వారిని చూసుకోవడంలో తాను అలసిపోతున్నట్లు అనునిత్యం ఫీల్ అయ్యేది.అందుకే పాలలో విషం కలిపి( Poisoned Milk ) ఇద్దరికీ తాగించింది.

ఆ తర్వాత తానూ కూడా ఆ విషం సేవించింది.ఈ ఘటనలో ముందు పిల్లలు మృతి చెందగా.

ఆ తర్వాత ఆ కసాయి తల్లి కూడా మరణించింది. """/" / ఈ విషయంపై పోలీసులు మాట్లాడుతూ… మృతురాలి పేరు రేఖ,( Rekha ) భర్త పేరు యోగేష్ చింపాగా తేల్చారు.

భార్య-భర్తకు గొడవలు రావడంతో రేఖ తన తల్లితో కలిసి ఉంటున్నట్లు చెబుతున్నారు.ఆమె పాలి జిల్లాలోని సేవడిలో నివసిస్తుంది.

రేఖకు 1.25 సంవత్సరాల వయస్సు కలిగిన పూర్వంష్ , పూర్విత్ అనే ఇద్దరు కవల కుమారులు ఉన్నారు.

బుధవారం మధ్యాహ్నం రేఖ తన కుమారులిద్దరికీ విషం ఇవ్వడమే కాకుండా తను కూడా విషం తాగింది.

దీంతో ముగ్గురూ చనిపోయారు.దాంతో ఈ హత్య, ఆత్మహత్య ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.

మృత్యువుతో పోరాడుతున్న రేఖని ఆస్పత్రిలో చేరడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.ఈ క్రమంలో పోలీసులు రేఖ వాంగ్మూలాలు తీసుకున్నారు.

తన కవలపిల్లలను పెంచడానికి ఇబ్బంది పడుతున్నానని.అందుకనే వారిని చంపి.

తాను చచ్చిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.

దేవర సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇవ్వమని డబ్బులు ఇచ్చారు….పూల చొక్కా నవీన్ షాకింగ్ కామెంట్స్!